ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 28 వేల 239 మందికి పరీక్షలు నిర్వహించగా... 657 మందికి వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. ఇందులో 611 మంది స్థానికులకు వైరస్ అంటుకోగా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 39 మంది, ఇతరదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా సోకింది.
మొత్తం కేసుల సంఖ్య 15వేల 252కు ఎగబాకింది. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో కొత్తగా ముగ్గురు చొప్పున మృతి చెందారు. మరో ఆరుగురి మృతితో ఏపీలో కొవిడ్ మరణాల సంఖ్య 193కు పెరిగింది. ప్రస్తుతం 8వేల 71 మంది చికిత్స పొందుతుండగా 6వేల988 మంది డిశ్చార్జి అయ్యారు.
ఇవీ చూడండి: 'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్.. మధురై వైద్యుడి ఘనత!