తెలంగాణ కరోనా కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ఈరోజు 26,704 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 403 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారి నుంచి ఇవాళ 145 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గత వారంతో పోలిస్తే ఇవాళ రెట్టింపు కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరో వైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 12 వేలకుపైగానే నమోదైన కొత్త కేసులు ఇవాళ 10వేల దిగువకు చేరాయి.. పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 79 వేలపైకి ఎగబాకాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది. ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధలు పాటించాలని ప్రజా ఆరోగ్యశాఖ పేర్కొంది. జనసమ్మర్థ ప్రాంతాల్లో మాస్క్, భౌతికదూరం తప్పనిసరని వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది. జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపింది.
ఇవీ చదవండి: