హైదరాబాద్ బల్దియా కార్యాలయంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. మేయర్ పేషీలో అటెండర్‌కు వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. పేషీని మూసివేసి ఉద్యోగులను ఇంటికి పంపి... కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు. దానితో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు చేయించాలని అధికారుల నిర్ణయించారు.
ముందుగా హెల్త్ సెక్షన్లో పనిచేసే దాదాపు 40 మందిని వైరస్ టెస్టులు చేయించుకోవాలని సమాచారం మేరకు బల్దియా సిబ్బంది సరోజినీదేవి ఆస్పత్రిలో పరీక్షలకు వెళ్లారు.
ఇదీ చదవండి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం