రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రజానాట్యమండలి బృందం సభ్యుడు జగన్... కరోనాపై అవగాహన కల్పిస్తూ ఓ పాటను రాసి స్వయంగా తానే పాడాడు. కరోనా నివారణకు నిర్విరామంగా కృషిచేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులను అభినందిస్తూ ఆలపించిన పాట ఆకట్టుకుంటోంది. ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటిస్తూ కరోనా తరిమికొట్టాలని వారు కోరారు. కరోనా ఎంతటి ప్రమాదకరమో తెలియజేస్తూ పాడిన పాట ఆలోచింపజేస్తున్నది.
ఇదీ చదవండి: రోగికి సాయం కోసం బైక్పై 430కి.మీ ప్రయాణం