ETV Bharat / state

ఆగని కరోనా.. ఇవాళ మరో 94 కేసులు నమోదు

Corona alert
ఇవాళ మరో 94 కేసులు నమోదు
author img

By

Published : Jun 1, 2020, 8:26 PM IST

Updated : Jun 1, 2020, 9:05 PM IST

20:23 June 01

ఆగని కరోనా.. ఇవాళ మరో 94 కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇవాళ మరో 94 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,792కు పెరిగింది. ఈరోజు నమోదైన కేసుల్లో 2,264 మంది రాష్ట్ర వాసులున్నారు. మిగతా 434 మంది విదేశాల నుంచి వచ్చినవారు, వలస కూలీలు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 79 కరోనా కేసులు నమోదయ్యాయి.

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మూడు... మెదక్‌, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో రెండు... మహబూబాబాద్‌, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనాతో మరో ఆరుగురు మృతిచెందారు. వైరస్​ సోకి ఇప్పటివరకు 88 మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్​ నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,491 మంది డిశ్చార్జయ్యారు. ఆస్పత్రిలో 1,213 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 

ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : Jun 1, 2020, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.