బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీఈసెట్‌కు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసే గడువు ఈనెల 30 వరకు పొడిగించినట్లు కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు.
ఆలస్య రుసుముతో అక్టోబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అక్టోబరు 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. అక్టోబరు 19 నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి ఎన్ని రోజుల పాటు పరీక్షలు నిర్వహించాలో నిర్ణయించనున్నట్లు స్పష్టం చేశారు. దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన వారం తర్వాత ఫలితాలను ప్రకటిస్తామన్నారు.
ఇప్పటి వరకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు 3,968.. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు 2,889 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ సత్యనారాయణ వివరించారు.
ఇదీ చూడండి: ఎనుమాముల మార్కెట్లో మొదలైన పత్తి కొనుగోళ్లు