ETV Bharat / state

HEAVY RAINS IN TELANGANA: ఏకధాటి వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. అవస్థల్లో ప్రజలు - హైదరాబాద్​లో భారీ వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న జోరువానలకు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థలోని లోపాల వల్ల వరద నీటితో మురుగు నీరు కలిసి రోడ్లపైన ప్రవహిస్తోంది. పలు జిల్లాల్లోని పైవంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే భద్రాద్రి రామయ్య సన్నిధి.. ఎడతెరిపిలేని వర్షాలతో నిర్మానుష్యంగా మారింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ మామిడి వాగును దాటుతుండగా గల్లంతైన వ్యక్తి మృతదేహం ఇవాళ లభ్యమైంది.

heavy rains in telangana
heavy rains in telangana
author img

By

Published : Sep 6, 2021, 4:54 PM IST

Updated : Sep 6, 2021, 8:03 PM IST

HEAVY RAINS IN TELANGANA: ఏకధాటి వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. అవస్థల్లో ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో వరద పోటెత్తింది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు రావడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కారణంగా వరద ఉద్ధృతి పెరిగింది. పాల్వంచ మండలంలోని ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ పట్టణంలోని తెలంగాణ నగర్, శ్రీనివాస కాలనీ, ఒడ్డుగూడెం, కేసీఆర్ నగర్, రాహుల్​గాంధీనగర్, సోనియా నగర్​లో వరద నీరు ఇళ్లలోకి చేరుకొంది. పాల్వంచ మండలం దంతాలబోరలో వరద ప్రవాహానికి బీటీ రహదారి పైనుంచి వరద నీరు పొంగి ప్రవహించడం వల్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కొత్తగూడెం- భద్రాచలం జాతీయ రహదారిపై పలుచోట్ల వరద నీరు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ మణిదీప్ సూచించారు.

నిర్మానుష్యంగా రామయ్య సన్నిధి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లో ఎడతెరిపిలేని వాన పడుతోంది. ఏకధాటిగా కురుస్తోన్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతూ నిండుకుండలా మారాయి. మండలాల్లోని చాలా పాఠశాలలు, వసతి గృహాల్లోకి వరద నీరు చేరడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాల వల్ల భద్రాద్రి రామయ్య ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.

ఖమ్మం జిల్లావ్యాప్తంగా తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు జల్లులు పడుతున్నాయి. మధిర, బోనకల్లు, ఎర్రుపాలెం, వైరా, ఏన్కూరు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో పాండురంగాపురం, దానావాయిగూడెం, టీఎన్జీవో కాలనీ, మోతీనగర్‌, సహా శివారు ప్రాంతాల్లోకి నీరు నిలిచింది. మున్నేరు వాగులోకి వరద నీరు వచ్చి చేరుతోంది.

ముళ్లపొదల్లో మృతదేహం..

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ మామిడి వాగును.. నిన్న ద్విచక్ర వాహనంతో దాటుతూ గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామానికి చెందిన కమలాకర్​గా గుర్తించారు. గల్లంతైన వెంటనే గాలింపు చేపట్టగా.. ఆదివారం సాయంత్రం బైక్​ దొరికింది. ఇవాళ ఉదయం మరోసారి గాలించగా.. ముళ్లపొదల్లో కరుణాకర్ మృతదేహం లభ్యమైంది.

రాకపోకలు బంద్​...

కామారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగుతున్నాయి. పిట్లం మండలం రాంపూర్​కలాన్​ వద్ద లోలెవల్ వంతెనపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పిట్లం, బాన్సువాడ మండలాలకు రాకపోకలు బంద్​ అయ్యాయి. పెద్ద కొడప్​గల్​ మండలం పోచారం నుంచి పోచారం తండాకు వెళ్లే మార్గంలో వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మద్నూర్​ మండలం గోజేగావ్​లెండి వాగుకు ఉద్ధృతంగా నీరు వచ్చి చేరుతోంది. మద్నూర్ మండలం డోంగ్లీ-మాధన్​ హిప్పర్గ గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద వరద నీరు నిలిచి.. రాకపోకలకు అంతరాయం కలిగింది. జుక్కల్ మండలం కౌలాస్​నాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడం వల్ల మూడు గేట్లను ఎత్తి.. నీటిని విడుదల చేస్తున్నారు.

రాత్రంతా నిద్రలేకుండా గడిపాం..

అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మెదక్​ పట్టణంలోని గాంధీనగర్​ వీధిలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా నిద్రలేకుండా గడిపామని.. ఇళ్లలోని వస్తువులన్నీ తడిచిపోయాయని.. మరికొన్ని వస్తువులు నీళ్లలో కొట్టుకుపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ.. నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. ఫైర్​ ఇంజిన్​ సాయంతో ఈ నీటిని తొలగించే పనులు చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పురపాలక ఛైర్మన్​ చంద్రపాల్​.. ఇళ్లను పరిశీలించారు. బాధితులకు నిత్యావసర సరకులను అందించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని.. బాధితులకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

చినుకులతో మొదలై.. కుండపోతగా..

వరంగల్‌లో జోరువానలకు రహదారులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి చిన్నగా మొదలైన చినుకులు మధ్యాహ్నానికి కుండపోత వర్షంగా మారింది. హనుమకొండలో భారీ వర్షంతో రహదారులపైకి నీరుచేరింది. మోకాళ్ల లోతు వరకు నీరు చేరడం వల్ల వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ప్రజలకు సూచించారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కరీంనగర్​లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి... విద్యానగర్, రాంనగర్, కరీంనగర్, జ్యోతి నగర్, ముకరంపుర, శ్రీనగర కాలనీల్లోని ప్రధాన రహదారులు నీటమునిగాయి. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో సెయింట్ జాన్స్ పాఠశాల ఎదురుగా ఉన్న ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. ఫలితంగా అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. భగత్​నగర్​, కట్ట రాంపూర్​ వీధులు జలమయమయ్యాయి. సిరిసిల్ల రోడ్డులోని పద్మానగర్​, రాంనగర్​ ప్రధాన రహదారిపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా వదిలేయడం, మురుగునీటి కాలువలు అనుసంధానం చేయకపోవడం వల్ల వల్లే సమస్యలు తలెత్తినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో మేయర్​ పర్యటన..

కరీంనగర్ నగర పాలక మేయర్ సునీల్​రావు, కమిషనర్ అగర్వాల్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్ల మురుగు కాలువలు పొంగి.. రోడ్లపైకి నీరు చేరిందని సునీల్​రావు అన్నారు.

ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి నీటిని విడిచిపెట్టడం వల్ల పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్​ నిండుకుండను తలపిస్తోంది. 1,01,555 క్యూసెక్కుల నీపు బ్యారేజ్​లోకి వచ్చి చేరుతోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు వదిలేస్తున్నారు. పార్వతి బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.83 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.250 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆగస్టు 26 నుంచి నిరంతరాయంగా బ్యారేజ్ గేట్లను విడతలవారీగా ఎత్తుతూ.. 74 గేట్లకుగాను గత పదిరోజులుగా 60 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు మంథని నియోజకవర్గంలో గోదావరి నదిపై నిర్మించిన లక్ష్మి, అన్నారం బ్యారేజ్​ల నుంచీ నీటిని విడుదల చేస్తుండడం వల్ల గోదావరి తీరాన ఉన్న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచించారు.

ఎస్​ఆర్​ఎస్పీకి వరద..

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 63 వేల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 27 గేట్ల ద్వారా 1,24,840 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.5 అడుగుల నీటిమట్టం ఉంది. భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌, మేడిపల్లి, రామంతాపూర్‌, ఘట్‌కేసర్‌, బోడుప్పల్‌, పిర్జాదిగూడ, పోచారం తదితర ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన కాలనీల్లోకి ప్రజలు వర్షాకాలం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కనీస మౌలిక సదుపాయాలు లేక చిన్న చిన్న వర్షాలకే రోడ్లు ఛిద్రమై.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చిందంచే చాలు మురుగు నీరంతా తమ కాలనీల్లోనే నిల్వ ఉండిపోతోందని వాపోతున్నారు. కొన్ని కాలనీల్లోకి వరద నీరు చేరడం వల్ల ఇళ్లకు తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.

ఎందుకీ దుస్థితి..

మూసీ కాలువలను అనుకొని కొందరు లేఅవుట్లు రూపొందించారు. మరికొందరు మూసీ కాలువను కబ్జా చేసి అమ్మేశారు. దీంతో హైదరాబాద్‌ నగరం నుంచి వచ్చే వర్షం నీరు మూసీ కాలువ వెంట ప్రవహించకుండా కొత్తగా ఏర్పడ్డ కాలనీలోకి వచ్చి చేరుతోంది. కొత్త కాలనీల్లో సరైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వచ్చిన నీరు కాలనీలోనే నిల్వ ఉండిపోతోంది. దీంతో ఆయా కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు.

భారీ వర్షాల కారణంగా మేడ్చల్ జిల్లా కాప్రా చెరువు పూర్తిగా నిండిపోయింది. నాళాలు పొంగిపొర్లుతూ.. ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. నాగారం ప్రధాన రహదారిపై గత వారం రోజుల నుంచి మోకాలు లోతు నీళ్లు నిల్వ ఉండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాప్రా శివసాయి నగర్​లో గత నాలుగు రోజుల నుంచి కాలనీలోకి నీళ్లు వస్తుండడం వల్ల బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

ఇదీచూడండి: అలర్ట్​ హైదరాబాద్‌... 6 - 8 గంటలపాటు ఇళ్లల్లోనే ఉండండి

Last Updated : Sep 6, 2021, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.