హైదరాబాద్ నగరంలోని పలు ఏరియాల్లో కేసులు తగ్గడం వల్ల 47 కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేసినట్లు జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా కేసులు ఉన్న ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇంకా 100కు పైగా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూంకు ఇవాళ ఆహారం కావాలని 585 ఫోన్లు వచ్చినట్లు తెలిపారు. కరోనాను అరికట్టేందుకు రైతు బజార్లు, మార్కెట్లను తనిఖీ చేసి.. ప్రభుత్వం నిర్దేశించిన చర్యలను మానిటరింగ్ చేయాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. రైతు బజార్లు, మార్కెట్ ప్రాంతాలను పరిశుభ్రతగా ఉంచాలని... సోడియం హైపో క్లోరైట్ క్రిమిసంహారకాలను పిచికారీ చేయించాలన్నారు. మార్కెట్లో నిత్యావసరాలు, కాయగూరలు విక్రయిస్తున్న వ్యక్తులందరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని.. భౌతిక దూరo నియమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్డౌన్ పొడిగింపు