ETV Bharat / state

Consumer Win 16 Year of Land Case in Hyderabad : స్థలం అభివృద్ధి చేస్తామని మోసం.. 16 ఏళ్ల తర్వాత తీర్పు చెప్పిన వినియోదారుల కమిషన్ - 16 ఏళ్ల తర్వాత భూమి కేసులో తీర్పు

Consumer Win 16 Year of Land Case in Hyderabad : స్థలాన్ని అభివృద్ధి చేసి అప్పగిస్తామంటూ కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో ఫిర్యాదుదారు రూ.37.70 లక్షలు చెల్లించాలని తెలంగాణ వినియోగదారుల కమిషన్​ ఆదేశాలు జారీ చేసింది. 2007 నుంచి ఇప్పటివరకు 12 శాతం వడ్డీతో ఈ సొమ్మును చెల్లించాలని సూచించింది. అందులో ఫిర్యాదుదారునికి మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు లక్ష రూపాయలు.. ఖర్చుల కింద మరో రూ.50 వేలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్​ ఆదేశించింది.

Consumer Win 16 Year of Land Case
Consumer Win 16 Year of Land Case in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 12:26 PM IST

Consumer Win 16 Year of Land Case in Hyderabad : ఈ మధ్య కాలంలో ఆన్​లైన్​ కొనుగోలు(Online Frauds), ఆన్​లైన్​ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే అదనుగా భావించి.. మోసగాళ్లు నేరాళ్లకు పాల్పడిన సందర్భాలు అనేకం. ఇక ఆఫ్​లైన్​లోనూ అంటే దుకాణాల్లో, షాపింగ్ మాల్స్​లో.. ఇతరుల వద్ద ప్రత్యక్షంగా మోసపోతున్న వారెందరో. ఒక వస్తువును కొన్నప్పుడు నష్టపోయామని గ్రహించినా.. వ్యవహారమేదైనా.. మోసపోయామని భావించినా ఇక చింతపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వినియోగదారుల కమిషన్(​Telangana State Consumer Commission) ఎప్పుడు వినియోగదారుడికి అండగా ఉంటుంది.

land fight in Consumer Court at Hyderabad : ప్రతి రాష్ట్రంలోనూ వినియోగదారుల కమిషన్​ అందుబాటులో ఉంటుంది. తాజాగా 16 ఏళ్ల క్రితం జరిగిన కేసులో ఇప్పుడు రాష్ట్ర వినియోగదారుల కమిషన్​ తీర్పును వెలువరించింది. ఆ కేసులో స్థలాన్ని అభివృద్ధి చేసి అప్పగిస్తామంటూ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఈ కమిషన్​ ఏకంగా ఓ రియల్టర్​ కంపెనీకి రూ.37.70 లక్షల జరిమానా విధించింది. అంతే కాదండోయ్ అతణ్ని 16 ఏళ్లుగా మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు కూడా మూల్యం చెల్లించుకునేలా చేసింది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్​కు చెందిన ఎన్​ఆర్​ఐ శ్రీనివాసరావు కర్ణాటకలో వివేకానంద కుమార్​, దాసరి శ్రీనాథరావు, సుధాకర్​రెడ్డిలకు చెందిన వీఈజీఈ రియల్టర్స్​ సంస్థ వద్ద కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. అందుకు ఆ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి విడతల వారీగా రూ.37.70 లక్షలను వారికి మూడు విడతలుగా చెల్లించారు. స్థలాన్ని అభివృద్ధి చేయడానికి ఆ సంస్థతో 2007 ఏప్రిల్​లో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ సంస్థ ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో.. శ్రీనివాసరావు తెలంగాణ వినియోగదారుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు.

క్యారీ బ్యాగ్‌కు డ‌బ్బులు వ‌సూలు చేసిన 'స్పెన్సర్‌'.. షాకిచ్చిన క‌స్ట‌మ‌ర్

Telangana State Consumer Commission : ఈ విషయంపై విచారించిన కమిషన్​ ఇన్​ఛార్జి అధ్యక్షురాలు మీనా రామనాథన్​, సభ్యులు కె. రంగరావులతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించింది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత కమిషన్​ ఫిర్యాదుదారుడికి ఉపశమనం కల్పించింది. అయితే ఫిర్యాదుదారుడికి సొమ్ము తిరిగి ఇచ్చేశామంటూ సంస్థ సమర్పించిన రసీదులను ఫోరెన్సిక్​ ల్యాబ్​కు కమిషన్​ పంపించింది. ఆ పరీక్షలో అవి ఫోర్జరీ సంతకాలు అని తేలడంతో.. కమిషన్​ ఆగ్రహించింది.

Telangana Consumer Commission Ruled After 16 Years : శ్రీనివాసరావు సొమ్మును తిరిగి ఇచ్చేయాల్సిందేనని వినియోగదారుల కోర్టు తీర్పులో పేర్కొంది. 2007 నుంచి ఇప్పటి వరకు 12 శాతం వడ్డీతో రూ.37.70 లక్షలు చెల్లించాలని వీఈజీఈ రియల్టర్స్​ అండ్​ బిల్డింగ్స్​ను వినియోగదారుల కమిషన్​ ఆదేశించింది. బాధితుడిని మానసికంగా వేదనకు గురి చేసినందుకు పరిహారంగా మరో లక్ష రూపాయలు చెల్లించాలని.. ఖర్చుల కింద మరో రూ.50 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లో ప్రతివాదులు శ్రీనివాసరావుకు డబ్బులు మొత్తం చెల్లించాలని సూచించింది.

TSRTC Cargo Service : పార్శిల్‌ పంపమంటే.. వేలంలో అమ్మేశారు​

'యువకుడి మృతికి రూ.40 లక్షలు చెల్లించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.