ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మూడో విడతలోని రెండో దఫాలో భాగంగా రాష్ట్రంలో రూ. 1,020 కోట్ల వ్యయంతో రహదార్లు, వంతెనలు నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. 1,217 కిలోమీటర్ల పొడవుతో 194 రహదార్లను, 6,132 మీటర్లతో 95 వంతెనలను ఈ దఫాలో చేపట్టేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు పంపింది.
మొత్తం 289 పనులకు గాను రూ. 1,020 కోట్ల నిర్మాణ వ్యయం కానుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 606 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 413కోట్లు. ఐదేళ్ల నిర్వహణ వ్యయం మరో రూ. 63 కోట్లు కానుంది. మొత్తం రూ. 1,084 కోట్ల వ్యయంతో రహదార్లు, వంతెనల పనులు చేపట్టేందుకు అనుమతి లభించింది. 194 రహదార్ల కోసం రూ. 800 కోట్లు, 95 వంతెనల కోసం రూ. 293 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: ఆర్టీపీసీఆర్ పరీక్షలపై హైకోర్టు అసంతృప్తి