రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములుగు జిల్లా వాజేడు గ్రామానికి చెందిన నాగసాయిచందు రెండేళ్ల నుంచి మేడిపల్లి పీఎస్లో క్రైమ్ విభాగంలో పని చేస్తున్నాడు. 15 రోజుల నుంచి నాగసాయి సెలవులో ఉన్నాడు. ఈనెల 11న విధుల్లో చేరాల్సి ఉంది.
మేడిపల్లి మండలం నిహారికకాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆత్మహత్యకు ముందు కానిస్టేబుల్ మద్యం సేవించినట్లు గుర్తించారు. తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.