హైదరాబాద్ పాతబస్తీ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో అరుణ్‌కుమార్ యాదవ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్లో ప్రజల భద్రత కోసం అనునిత్యం విధులకు హాజరై తన జీవితాన్ని అంకితం చేస్తూ.. తన జీతంలో సగభాగాన్ని పేద ప్రజల ఆకలి తీర్చడానికి కేటాయిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 800 మందికి అల్పాహారాన్ని అందించిన అరుణ్‌కుమార్ మానవత్వాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండిః ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం