Congress Vijayabheri Sabha Today in Tukkuguda : రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. హైదరాబాద్ తుక్కుగూడలో ఇవాళ విజయభేరి సభ నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం భాగ్యనగరానికి వచ్చిన పార్టీ అగ్రనేతలు.. బహిరంగ సభలో పాల్గొనున్నారు. తుక్కుగూడ సభ వేదికగా (Congress Vijayabheri Sabha ).. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఆరు హామీల గ్యారంటీ కార్డును కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ సోనియాగాంధీ విడుదల చేస్తారు.
Congress Vijayabheri Public Meeting Today : శాసనసభ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసేలా ఆరు హామీల పథకాలను రూపొందించారు. మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, నిరుద్యోగుల లక్ష్యంగా గ్యారంటీలు ఉండనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలతోపాటు.. సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు అంతా సభకు హాజరుకానున్నారు. పార్టీ అగ్రనేతలు పాల్గొంటుండం, ఎన్నికల గ్యారెంటీల ప్రకటించే సభ కావడంతో.. పీసీసీ కనీవిని ఎరుగనిరీతిలో ఏర్పాట్లు చేసింది.
CWC Meetings Schedule Hyderabad 2023 : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. షెడ్యూల్ ఇదే
Congress Vijayabheri Sabha : తుక్కుగూడ వద్ద వంద ఎకరాల స్థలంలో సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి.. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు విజయభేరి సభకు తరలిరానున్నారు. మూడు వందల మంది కూర్చొనేందుకు వీలుగా వేదికను ఏర్పాటు చేశారు. సభకు హాజరైన అందరు నేతలు జనానికి కనిపించేలా.. కుడి వైపు కళాకారుల కోసం, ఎడమవైపు రాష్ట్ర సీనియర్ నాయకులు కూర్చొనేందుకు మరొక స్టేజీ నిర్మించారు.
Sonia Gandhi Will Participate in Tukkuguda Sabha : అయితే ఖమ్మం సభలో చోటు చేసుకున్న ఇబ్బందులను అధిక మించేందుకు భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా.. ప్రధాన వేదిక ముందు వంద అడుగుల మేర ఖాళీ ప్రదేశాన్ని వదిలేశారు. ఆ ప్రాంతంలో ఎవరికి ప్రవేశం ఉండదు. జనానికి స్టేజీ దూరంగా ఉండడంతో.. సోనియా గాంధీ (Sonia Gandhi), ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. తాజ్‌కృష్ణ హోటల్ ఎక్స్‌టెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం నేతలంతా ప్రత్యేక బస్సుల్లో తుక్కుగూడ బయలుదేరి వస్తారు.
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సభాస్థలికి చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాత్రి 8:30 గంటలకు తిరుగు ప్రయాణం ఉండడంతో ఏడు గంటలకు సభ ముగిసేట్లు కార్యాచరణ సిద్ధం చేశారు. సోనియాగాంధీ ప్రధాన వేదిక వద్దకు చేరుకునే మార్గంలో.. ఆరు వేల మందికిపైగా మహిళలు.. ఆమెకు స్వాగతం పలకనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. భారత్ జోడో యాత్రకు సంబంధించిన చిత్రాలు, దృశ్యాలను వేదికపై ఏర్పాటు చేసిన తెరపై ప్రదర్శించనున్నారు. విజయభేరి సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
Ticket War in Telangana Congress : కాంగ్రెస్‌లో కలహాలు.. తారాస్థాయికి చేరిన టికెట్ కొట్లాట