ETV Bharat / state

Congress Vijayabheri Sabha in Tukkuguda : 'విజయ భేరి' విజయానికి కాంగ్రెస్ పక్కాప్లాన్.. సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్ - తుక్కుగుడ కాంగ్రెస్ విజయభేరి సభ

Congress Vijayabheri Sabha in Tukkuguda : హైదరాబాద్‌ తుక్కుగూడ వేదికగా ఈనెల 17 నిర్వహించే విజయభేరి సభకు కాంగ్రెస్‌ సన్నాహాలను ముమ్మరం చేసింది. సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేతలు విజయవంతం చేసేందుకు ప్రత్యేక దృష్టిసారించారు. హనుమకొండలో విజయభేరీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్​, కేటీఆర్​ తాకట్టుపెట్టారని ఆరోపించారు. మరోవైపు తుక్కుగూడ సభకు రాచకొండ పోలీసులు అనుమతించారు.

Congress Vijayabheri Sabha
Congress Vijayabheri Sabha in Tukkuguda
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2023, 7:14 AM IST

Congress Vijayabheri Sabha in Tukkuguda సెప్టెంబరు 17న కాంగ్రెస్ విజయ భేరి సభ.. విజయవంతం చేసేందుకు నాయకుల ప్రణాళిక

Congress Vijayabheri Sabha in Tukkuguda : పార్టీ పేరులో తెలంగాణ లేకుండా చేసిన కేసీఆర్​కు తెలంగాణ ప్రజలతో ఏం సంబంధమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తానని స్పష్టం చేశారు. హనుమకొండలో నిర్వహించిన విజయభేరి సభ సన్నాహక సమాశంలో ఆయన పాల్గొన్నారు. ఈనెల 17న తుక్కుగూడకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సకుటుంబంగా రాష్ట్రానికి వచ్చి సభ నిర్వహిస్తుంటే.. దానిని అడ్డుకునేందుకు.. కేసీఆర్, మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ఆక్షేపించారు. కేసీఆర్‌కే కేవీపీ రామచంద్రరావు బంధువు తప్ప తనకు కాదన్నది కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. సమైక్యవాదం వినిపించిన ఏపీ సీఎం జగన్‌కి ప్రగతి భవన్‌లో పరమాన్నం పెట్టింది ఎవరని ప్రశ్నించారు.

Congress Screening Committee to Meet on 20th September : ఈ నెల 20న కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ సమావేశం.. అప్పుడే అభ్యర్థుల జాబితా

"రాష్ట్రానికి ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తే మీరేమో ప్రగతిభవన్ ప్రారంభోత్సవం రోజున ఆంధ్రా వాళ్లను మీ కుర్చిలో కూర్చోబెట్టి వారి కాళ్లకు దండం పెట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రోళ్ల కాళ్ల దగ్గర పెట్టివారు ఈ రోజు నా గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం చచ్చే బిడ్డను నేను. ఆ రోజు తెలంగాణకు జగన్​ వస్తే తెలంగాణ బిడ్డలు ఎలా సమాధానం చెప్పారో మీరే దానికి సజీవ సాక్షి కదా." - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Congress Public Meeting in Tukkuguda : హైదరాబాద్ శివారులో తుక్కుగూడ వద్ద ఈనెల17న జరగనున్న విజయభేరి సభ ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. సభ నిర్వహణకు జరుగుతున్న పనులను చూసి నేతలకు పలు సూచనలు చేశారు. వంద ఎకరాలకు పైగా ఖాళీ స్థలాన్ని చదును చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. సభా వేదికతోపాటు మరో రెండు స్టేజీలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఖమ్మం సభను దృష్టిలో పెట్టుకొని భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భద్రతా కారణాల రీత్యా మూడు స్టేజీల పరిసరాల్లోకి ఎవరిని అనుమతించరని నేతలు తెలిపారు.

Revanth Readdy Letter to Tenant Farmers : 'వరంగల్​ డిక్లరేషన్​లోని ప్రతి హామీ నెరవేరుస్తాం'.. కౌలు రైతులకి రేవంత్ బహిరంగ లేఖ

ఈనెల 17న తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరి సభకు రాచకొండ పోలీసులు అనుమతి ఇచ్చారు. 25 నిబంధనలతో సీపీ డీఎస్‌ చౌహాన్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు సభ నిర్వహణకు అనుమతి ఇచ్చారు. సభకు పది వేల మందికి మించకూడదని నిబంధన పెట్టారు.

కౌలు రైతులకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్ సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్‌ నేరవేరుస్తుందని కౌలు రైతులకు భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు ఏటా 15 వేల పెట్టుబడి సాయం చేస్తామని స్పష్టం చేశారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలుతోపాటు మెరుగైన పంటల బీమా పథకం తెస్తామన్నారు. రైతు రాజ్యస్థాపనే కాంగ్రెస్‌ లక్ష్యమని స్పష్టం చేశారు.

Congress Vijayabheri Sabha Arrangements : చరిత్రలో నిలిచేలా కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ..!

CWC Meetings Schedule Hyderabad 2023 : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. షెడ్యూల్ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.