ETV Bharat / state

Congress TS Formation day Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో విపక్షాలు - hyderabad news

Bandi sanjay speech about Formation Day : ఆవిర్భావ వేడుకలను రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు ఘనంగా నిర్వహించాయి. ఆయా పార్టీల నేతలు జాతీయ జెండా ఎగురవేసి.. అమరవీరులకు నివాళులర్పించారు. పార్టీల నేతల రాకతో హైదరాబాద్‌లో గన్‌పార్కు కిటకిటలాడింది. నాటి పోరాటస్మృతులను గుర్తు చేసుకున్న నాయకులు.. అమరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.

Congress TS Formation day Celebrations
Congress TS Formation day Celebrations
author img

By

Published : Jun 2, 2023, 7:58 PM IST

Updated : Jun 2, 2023, 8:40 PM IST

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో విపక్షాలు

Telangan Formation day 2023 : తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్‌ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ హాజరయ్యారు. పార్టీ సీనియర్ నేతలతో కలిసి గన్‌పార్కు వద్ద మీరాకుమార్ అమరవీరులకు నివాళి అర్పించారు. బషీర్ బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని మీరాకుమార్ ప్రారంభించారు. అబిడ్స్‌, కోఠి, ఎంజే మార్కెట్ మీదుగా ప్రదర్శన గాంధీభవన్​కు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఉద్యమకారులను మీరాకుమార్‌ సన్మానించారు.

"తెలంగాణ దేనికోసం పోరాటం చేశారో ఆ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ ప్రజల పోరాటం చూసి కాంగ్రెస్​ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలు మా పార్టీకి మాత్రమే తెలుసు."- మీరాకుమార్, లోక్‌సభ మాజీ స్పీకర్

BJP on TS Formation Day 2023 : వేడుకలను బీజేపీ ఘనంగా నిర్వహించింది. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జెండా ఆవిష్కరణ చేసి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినా.. బీఆర్​ఎస్​ పరిపాలనతో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని సంజయ్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని టీజేఎస్​ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కోదండరాం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళి అర్పించి, నాటి పోరాట ఘట్టాలు గుర్తుచేసుకున్నారు.

Bandi Sanjay On Telangana Formation Day : 'తొమ్మిదేళ్ల BRS పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు'

TDP Celebrations of TS Formation day : గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నివాళి అర్పించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. లక్డికాపూల్లోని బీఎస్పీ కార్యాలయంలో ప్రవీణ్‌కుమార్‌, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ​ కార్యాలయంలో వైఎస్​ షర్మిల జాతీయజెండా ఎగురవేశారు. ఎన్టీఆర్​ భవన్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ జాతీయ పతాకం ఆవిష్కరించారు. గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఉద్యమకారులంతా తనతో కలిసిరావాలని కోరారు.

Etela rajender speech about Formation day : నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి జాతీయ జెండా ఎగురవేయగా.. జగిత్యాలలో జీవన్‌రెడ్డి, మంథనిలో శ్రీధర్‌బాబు.. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆ పార్టీ నేత సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఈటల రాజేందర్‌ జాతీయ జెండా ఎగురవేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 2, 2023, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.