ETV Bharat / state

రాష్ట్రంలో కాంగ్రెస్ జాతీయ నేతల మోహరింపు - అధికార పార్టీని ఢీకొట్టే ఎత్తులతో దూకుడుగా వ్యవహరిస్తున్న అగ్రనేతలు - Priyanka Gandhi election campaign in Telangana

Congress Top Leaders Election Campaign in Telangana : ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల క్రతువు ముగియటంతో.. కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వాన్ని రాష్ట్రంలో మోహరించింది. ఆకట్టుకునే హామీలు, అధికార పార్టీని ఢీకొట్టే ఎత్తులతో దూకుడుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ .. మిగిలిన రెండు రోజులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి సారించింది. హస్తం అగ్రనేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు, రాష్ట్ర నేతలు తీరిక లేకుండా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Congress Election Campaign in Telangana
Congress Election Campaign in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 7:38 AM IST

బీఆర్ఎస్‌ను ఢీకొట్టేలా కాంగ్రెస్ దూకుడు

Congress Top Leaders Election Campaign in Telangana : తెలంగాణలో మార్పు కావాలని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా.. పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రియాంక గాంధీ కోరారు. పదేళ్లుగా పడిన కష్టాలు ఆలోచించి.. హస్తం పార్టీని భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకొస్తే.. సమస్యలను పరిష్కరించే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం ఖమ్మం జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో పర్యటించారు.

ఇందిరమ్మపై హాస్యాస్పద వ్యాఖ్యలా అంటూ కేసీఆర్​పై ఖర్గే ఫైర్

Priyanka Gandhi Election Campaign in Telangana 2023 : ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు.. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మట్టా రాగమయికి మద్దతుగా 3 నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) రోడ్‌ షోలు నిర్వహించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Bhatti Vikramarka) విజయాన్ని కాంక్షిస్తూ మధిరలో ఏర్పాటు చేసిన విజయ గర్జన సభలో ఆమె పాల్గొన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. పేదలకు ఇళ్లు, యువతకు ఉద్యోగాలు, రైతుల సంక్షేమం, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే హస్తం పార్టీని గెలిపించాలని కోరారు.

తెలంగాణ ప్రజలు బాధలో ఉన్నారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను, స్వప్నాలను నెరవేర్చలేదు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వం వాళ్ల కుటుంబ ప్రయోజనాలు, ధనవంతుల ప్రయోజనాల కోసమే పని చేస్తోంది. పేదలు, రైతులు, యువత కోసం పనిచేయడం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అతీతుడిగా పని చేస్తున్నారు. - ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

Rahul Gandhi Election Campaign in Telangana : నిన్న బోధన్‌, ఆదిలాబాద్‌, వేములవాడ బహిరంగసభల్లో పాల్గొన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. రాత్రి హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఆకస్మికంగా పర్యటించారు. చిక్కడపల్లిలోని కేంద్ర గ్రంథాలయం వద్దకు చేరుకున్నారు. సామాన్య వ్యక్తిలా నేలపై కూర్చొని నిరుద్యోగులతో ముచ్చటించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ పలువురు యువకులు.. ఆయన ముందు భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతుందని.. తనపై నమ్మకం ఉంచాలని రాహుల్ గాంధీ వారికి భరోసానిచ్చారు.

దొరల రాజ్యాన్ని గద్దె దింపాలి- ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి: రేవంత్​రెడ్డి

అనంతరం, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చీ హోటల్‌కు వెళ్లిన రాహుల్‌ గాంధీ.. అక్కడ ఇతర కస్టమర్లతో పాటు కూర్చుని తనకిష్టమైన వెరైటీలను ఆర్టర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందు కోసం రూ.5280 చెల్లించినట్లు హోటల్‌ సిబ్బంది వెల్లడించారు. రాహుల్ గాంధీ హోటల్ నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించారు.

Telangana Assembly Elections 2023 : కేసీఆర్‌ అబద్ధాల కోరని.. ఆయన పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో పర్యటించిన డీకే.. ముషీరాబాద్ అభ్యర్థి అంజన్‌కుమార్‌ యాదవ్‌కు మద్దతుగా కవాడీగూడలో రోడ్‌ షో నిర్వహించారు. దేశమంతా తెలంగాణ ఎన్నికల వైపు చూస్తోందన్న ఆయన.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందన్నారు.

రెండు పర్యాయాలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసినా - ప్రజల జీవితాలు బాగుపడలేదు : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

రాష్ట్రంలో ఓటమి తప్పదని బీఆర్ఎస్‌, బీజేపీలు కర్ణాటక హామీలపై దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండురావు మండిపడ్డారు. భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణకు మద్దతుగా.. గణపురం మండలం చేల్పూర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, వేములపల్లి మండలాల్లో.. మిర్యాలగూడ హస్తం పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.

హైదరాబాద్‌ ఆల్విన్ కాలనీ డివిజన్‌కు చెందిన పలువురు టీడీపీ నేతలు.. కాంగ్రెస్‌లో చేరారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో హుజూరాబాద్ హస్తం పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్‌ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా మాహాముత్తారం మండలంలో.. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (MLA Sridhar Babu).. ఆరు గ్యారెంటీలు, పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో, నిర్మల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా.. ఆ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌ విజయశాంతి (Vijayashanthi) ప్రచారం చేశారు. కోరుట్లలో జువ్వాడి నర్సింగరావు, నిర్మల్‌లో శ్రీహరిని గెలిపించాలంటూ రోడ్‌ షో నిర్వహించిన విజయశాంతి.. బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Congress Leaders Election Campaign in Telangana : అచ్చంపేటలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనానికి.. బిహార్‌ సీఎల్పీ నేత షకీల్ అహ్మద్, కర్ణాటక ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో.. హుస్నాబాద్ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో హస్తం పార్టీ అభ్యర్థి రామదాసునాయక్ ప్రచారం చేశారు.

CPM Election Campaign in Telangana : సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ (Brinda Karat) ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో.. పార్టీ అభ్యర్థి భూక్య వీరభద్రంతో కలిసి రోడ్‌ షో నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి.. ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో తాము పోటీచేయని చోట కాంగ్రెస్‌కు మద్దతిస్తామని.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు.

ఖమ్మం సీపీఎం జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన సీతారాం ఏచూరి (Sitaram Yechury).. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో కాంగ్రెస్ వైపు మొగ్గు కనిపిస్తుందని అన్నారు. తెలంగాణలో హంగ్ వస్తే.. బీఆర్ఎస్‌ నిస్సందేహంగా బీజేపీ మద్దతు తీసుకుంటుందని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్‌ మీట్ ద ప్రెస్‌లో పాల్గొన్న ఆయన.. తాము ఇండియా కూటమితోనే ఉన్నామని, రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకే తెలంగాణలో ఒంటరిగా పోటీచేస్తున్నట్లు తెలిపారు.

ప్రజల బాధలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు : ప్రియాంక గాంధీ

గాంధీభవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ మిత్రపక్షాల సమన్వయ కమిటీ.. తమ కలయికతో బీఆర్ఎస్‌ ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. హస్తం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా.. భారత రాష్ట్ర సమితి ప్రకటనలు ఇస్తోందంటూ.. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి.. ఆర్టీసీ ఐకాస బేషరతుగా మద్దతు ప్రకటించింది.

తెలంగాణలో కాంగ్రెస్‌కు డీఎంకే మద్దతు - అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని సానుభూతిపరులకు స్టాలిన్ పిలుపు

రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్​ - రంగంలోకి దిగుతున్న అగ్రనేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.