ETV Bharat / state

ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం : ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి - ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఏపీఆర్‌, ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసినట్లైతే కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందని లేఖలో ఆ విషయాన్ని వెల్లడించారు.

congress support the trs government in telangana uttam kumar Reddy
ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం : ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
author img

By

Published : Mar 8, 2020, 10:44 PM IST

ప్రభుత్వం ఏపీఆర్‌, ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లైతే కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఉత్తమ్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఎన్‌పీఆర్‌కు సంబంధించిన కార్యకలాపాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని విజ్ఞప్తి చేశారు.

మతపరమైన ఎజెండాతో కేంద్రం తీసుకొచ్చిన వాటి పట్ల అప్రమత్తంగా ఉండి అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. కేరళ ప్రభుత్వం గతేడాది డిసెంబరు 20న ఇచ్చిన జీవో కాపీని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖకు జతచేసి పంపారు.

ఇదీ చూడండి : అక్కరకు రాని ప్లాస్టిక్​తో.. పనికొచ్చే వస్తువులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.