వలసకూలీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ గాంధీభవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు దీక్షకు దిగారు. ఉదయం 11 గంటలకు కూర్చొన్న ఆయన సాయంత్రం 4 గంటల వరకు దీక్షను కొనసాగించనున్నారు. ఆయనకు మద్దతుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.
ఇవీ చూడండి: లాక్డౌన్కు స్వస్తి.. పర్యటక రంగం ప్రారంభం!