ETV Bharat / state

Vh: 'సీనియర్లతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోండి'

2014 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ (Congress)లో అంతర్గత సమీక్ష జరగలేదని ఆరోపించారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ (Vh). ప్రతి ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలేమిటో మేధోమథనం జరగాల్సి ఉందని హనుమంతురావు (Vh) అభిప్రాయపడ్డారు.

vh
vh
author img

By

Published : Jun 9, 2021, 5:29 PM IST

రాష్ట్రంలో పీసీసీ (Pcc) అధ్యక్షుడి ప్రకటనకు ముందే సీనియర్లతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు (Vh) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌కు ఆయన లేఖ రాశారు. 2014 నుంచి ఇప్పటివరకు పార్టీ అంతర్గత సమీక్ష జరగలేదని ఆరోపించారు. ప్రతి ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలేమిటో మేధోమథనం జరగాల్సి ఉందని హనుమంతరావు (Vh) అభిప్రాయపడ్డారు.

కేరళలో పార్టీ ఓటమిపాలవగానే పీసీసీని మార్చేశారని... ఇక్కడ ఆలాంటిదేమీ చేయలేదని ఆరోపించారు. 2023 ఎన్నికలో లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాల్సి ఉండగా... రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ ఏమీ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పార్టీలో జరుగుతున్న తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుని ముందుకెళ్లాలని సూచించారు. నాగార్జున సాగర్‌లో అంతకు ముందు జరిగిన జనరల్‌ ఎన్నికల్లో ఏడువేలతో ఓడిపోయిన జానారెడ్డి... నిన్నటి ఉపఎన్నికలో ఏకంగా 18వేల తేడాతో ఓటమి పాలయ్యారన్నారు.

అందరిని కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయం తీసుకుంటే తాము అంతా కలిసి పనిచేస్తామని వివరించారు. తాను కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడినని, పీసీసీ మాజీ అధ్యక్షుడిని అయిన తననే నోటికొచ్చినట్లు దుర్భాషలాడితే స్పందించే నాథుడే లేరని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.