ETV Bharat / state

'భూ కబ్జాలు చేసే వారికి శిక్ష పడేలా చట్టం తీసుకురావాలి'

భూ కబ్జాలు చేసే వారికి శిక్ష పడేలా చట్టం తేవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ప్రభుత్వానికి సూచించారు. గ్యాస్ ధరల పెంపుపై కేంద్రాన్ని... రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించాల్సిన అవసరముందని తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించాలని కోరారు.

congress senior leader vh hanumanth rao meeting his home on several topics
'భూ కబ్జాలు చేసే వారికి శిక్ష పడేలా చట్టం తీసుకురావాలి'
author img

By

Published : Dec 17, 2020, 4:49 PM IST

ధరణి చట్టంలో భూకబ్జాల మీద స్పష్టత లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంత రావు తెలిపారు. అంబర్‌పేట్‌లోని తన నివాసంలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి... పలు అంశాలపై చర్చించారు. భూ కబ్జాలు చేసే వారికి శిక్షపడేలా చట్టం తీసుకురావాలని సూచించారు. గ్యాస్‌ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు.

పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించాలని కోరారు. గతంలో బీసీలు అధ్యక్షులుగా ఉన్నప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తే... వారు పార్టీలు మారుతున్నారని తెలిపారు.

ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కార్యశాల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.