రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడేట్లు ఉండాలని పేర్కొంటూ మాజీ ఎంపీ వి.హనుమంతరావు... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖలో అధికారుల అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిందని ఆరోపించారు.
కీసర మండలంలో పేదలకు ఇందిరా గాంధీ ఇచ్చిన భూములను స్థిరాస్థి వ్యాపారులు ఆక్రమించుకున్నారని.. ఈ విషయంలో వారికి న్యాయం చేయాలని కోరారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు... తిరిగి వారికి అందినపుడే మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావుకు నిజమైన నివాళి అని వీహెచ్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: రెవెన్యూ కార్యాలయాల్లో కొలిక్కి వచ్చిన పునర్వ్యవస్థీకరణ!