ETV Bharat / state

ప్రధాని అందరితో చర్చిస్తున్నారు.. కేసీఆర్​కు ఏమైంది? : వీహెచ్ - తెలంగాణ సీఎం కేసీఆర్

కరోనా మహమ్మారితో ఓ వైపు ప్రపంచం అతలాకుతలమవుతుంటే మరోవైపు సీఎం కేసీఆర్ మాత్రం ఒంటెద్దు పోకడలు పోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. లాక్​డౌన్ విధించి 31 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఏ నేతలతోనూ రాష్ట్ర పరిస్థితులపై చర్చించలేదని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్ష పార్టీల నేతను ఎందుకు సంప్రదించరూ ? : వీహెచ్

author img

By

Published : Apr 23, 2020, 8:21 PM IST

కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. కొవిడ్ బారిన పడి వేలాది ప్రజలు మరణిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పెను విపత్తు సమయంలో ప్రధాన మంత్రి అన్ని రాజకీయ పార్టీలతో కరోనా నివారణకు చర్చలు సాగిస్తున్నారని వీహెచ్ అన్నారు. ప్రధాని ముఖ్యమంత్రులతో సైతం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. దేశంలోని పరిస్థితులపై ప్రతి ఒక్కరితో చర్చిస్తున్నారు.

ఆహార పంపిణీ ఆపమనడం ఏమిటి ?

రాష్ట్రంలో లాక్ డౌన్ విధించి 31 రోజులు కావస్తున్నా విపక్ష పార్టీలకు చెందిన ఏ ఒక్క నాయకుడితో రాష్ట్ర పరిస్థితులపై కనీసం సంప్రదింపులు కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజుకొక కొత్త పద్ధతిలో ఎన్జీవోలు, దాతలు పేదవారికి, వలస కూలీలకు అన్న దానాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ వాటిని ఆపేయమనడాన్ని వీహెచ్ తప్పుబట్టారు. ఇలాంటి రాజకీయాన్ని తాను ఎన్నడూ చూడలేదని ఆయన ఎద్దేవా చేశారు. బీహార్, చత్తీస్ గఢ్, పశ్చిమ్ బంగ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు తిండికి తిప్పలు పడుతున్నారన్నారు. అలాంటి వారిని ముఖ్యమంత్రి పట్టించుకోరని పేర్కొన్నారు. అలాంటి పేదలకు, కార్మికుల కోసం క్యాంపులు ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు.

ఇవీ చూడండి : కరోనాతో సహజీవనం: లాక్​డౌన్​ ఎత్తివేత దిశగా ప్రపంచం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.