ప్రభుత్వం కరోనా కేసుల తరహాలోనే యురేనియం తవ్వకాలనూ ఎవ్వరికి తెలియకుండా దాస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. యురేనియం తవ్వితే విశాఖపట్నం తరహాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉరుకోదని మండిపడ్డారు.
రాష్ట్రంలో అన్ని రకాల విద్యుత్ ఉన్నప్పుడు ఇక కొత్తగా యురేనియం విద్యుత్ అవసరం లేదని వీహెచ్ స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలన్నారు. లేని ఎడల అన్ని పార్టీలు ఏకమై ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి:'మన జీవన విధానం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చు'