ETV Bharat / state

'గెలిచిన అభ్యర్థులు ఫిరాయిస్తే... అఫిడవిట్ తీసుకోవాల్సిందే' - మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ జారీ

సెలక్ట్‌-ఎలక్ట్‌ పద్ధతిలో రేపు మధ్యాహ్నంలోపు స్థానికంగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. గెలిచిన తర్వాత ఫిరాయింపులను అరికట్టడానికి... బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి అఫిడవిట్‌లు తీసుకోనుంది. నామినేషన్ల స్క్రుటినీ పూర్తైన తరువాత అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

congress ready for municipal elections
'గెలిచిన అభ్యర్థులు ఫిరాయిస్తే... అఫిఢవిట్​లు తీసుకోవాల్సిందే'
author img

By

Published : Jan 8, 2020, 5:22 AM IST

Updated : Jan 8, 2020, 9:27 AM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ గురువారం అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని ప్రకటించింది. మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కుంతియాతో పాటు 20 మందికిపైగా సీనియర్‌ నాయకులు సమావేశానికి హాజరయ్యారు.

'గెలిచిన అభ్యర్థులు ఫిరాయిస్తే... అఫిఢవిట్​లు తీసుకోవాల్సిందే'

ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో కమిటీ ఇచ్చిన నివేదిక, ప్రచారం, ఫిరాయింపులు తదితర అంశాలపై చర్చించారు. స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపికపై చర్చించాలని ఉత్తమ్​కుమార్​ రెడ్డి సూచించారు. సెలక్ట్‌-ఎలక్ట్‌ పద్ధతిలో గెలుపునే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే... క్రిమినల్‌ చర్యలు తీసుకోడానికి అవకాశం కల్పించేందుకు వీలుగా... అభ్యర్థుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కొందరు నాయకులను ప్రచారతారలుగా నియమించనున్నారు.

ఇవీ చూడండి: పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ ఇవ్వాలి: ఉత్తమ్​

TG_HYD_12_08_CONG_READY_FOR_MUNCIPAL_ELECTION_PKG_3038066 Reporter: M.Tirupal Reddy ()మున్సిపల్‌ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ సర్వం సిద్దమని ప్రకటించింది. రేపు మధ్యాహ్నం లోపు సెలక్ట్‌ -ఎలక్ట్ పద్దతిన స్థానికంగానే అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేయాలని నిర్ణయించింది. పిరాయింపులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా పార్టీ తరఫున బరిలో దిగనున్న అభ్యర్ధుల నుంచి 20 రూపాయల స్టాంపు పేపర్‌పై అఫిడవిట్‌ తీసుకోనుంది. మున్సిపాలిటీలన్నింటికి ఉమ్మడి మ్యానిఫెస్టో ఉంటుందని స్పష్టం చేసిన పీసీసీ నామినేషన్ల స్క్రూటినీ పూర్తయిన తరువాత అభ్యర్ధులకు బీఫార్మ్‌లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. LOOK వాయిస్ఓవర్‌1: రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ రేపటి లోపు అభ్యర్ధులను ఎంపిక పూర్తి చేస్తామని ప్రకటించింది. మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిన్న రాత్రి గాంధీభవన్‌లో అత్యవసరంగా సమావేశమైన కాంగ్రెస్‌ సీనియర్ నేతలు రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియాలతోపాటు 20 మందికిపైగా సీనియర్‌ నాయకులు సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, రిజర్వేషన్లు, అభ్యర్ధుల ఎంపిక, మ్యానిఫెస్టో కమిటీ ఇచ్చిన నివేదిక, ప్రచారం తదితర అంశాలపై చర్చించారు. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ఏలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి...అభ్యర్ధుల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్థానిక మ్యానిఫెస్టోల తయారీకి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు, రిజర్వేషన్లకు తగినవిధంగా అభ్యర్ధుల ఎంపికపై డీసీసీలు ఏవిధంగా ముందుకు వెళ్లాలి...బీ ఫార్మల పంపిణీ ఏవిధంగా జరగాలి...గెలుపొందిన తరువాత వార్డు సభ్యులుకాని, కార్పోరేటర్లుకాని పార్టీ పిరాయించకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను కూలంకుషంగా చర్చించారు. ......స్పాట్‌ విజువల్స్‌.... వాయిస్ఓవర్‌2: అభ్యర్ధుల ఎంపిక వ్యవహారం రేపు ఉదయం 11 గంటల లోపు పూర్తి చేయాలని పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలోని డీసీసీలకు, ఇతర ఇంఛార్జిలకు స్పష్టం చేశారు. సెలక్ట్‌-ఎలక్ట్‌ పద్దతిలో గెలుపునే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్ధులను ఎంపిక చేయాలని సూచించారు. ఉమ్మడి మ్యానిఫెస్టోతోపాటు మున్సిపాలిటీల వారీగా స్థానిక మ్యానిఫెస్టోలు తయారు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇవాళ ఉదయం 11గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జరగనున్న మున్సిపాలిటీల్లో, నగరపాలక సంస్థల్లో స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. స్థానికంగా ఏవైనా తేడాలు వస్తే అసెంబ్లీ నియోజక వర్గ కంటెస్టడ్‌ అభ్యర్ధి కన్వీనర్‌గా కంటెస్టడ్‌ ఎంపీ, డీసీసీ, పీసీసీ సభ్యులు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తదితరులు సభ్యులుగా కమిటీ చర్చించి తక్షణమే సరిదిద్దేట్లు యంత్రాంగాన్ని సిద్దం చేశారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే...క్రిమినల్‌ చర్యలు తీసుకోడానికి అవకాశం కల్పించేందుకు వీలుగా...పార్టీ తరఫున పోటీ చేసే ప్రతి అభ్యర్ధి నుంచి 20రూపాయల స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించింది. అభ్యర్ధులకు బీఫార్మ్‌లు ఇవ్వడానికి ఈ నెల 14వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ అభ్యర్ధుల స్క్రూటినీ పూర్తయ్యాక....ఈ నెల11, 12 తేదీల్లో బీఫార్మలను అందచేస్తారు. బైట్: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు వాయిస్ఓవర్‌3: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కొందరు నాయకులను స్టార్ క్యాంపెనర్లుగా ఇవాళ, రేపటి లోపు పీసీసీ ప్రకటించనుంది.
Last Updated : Jan 8, 2020, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.