ETV Bharat / state

'కాంగ్రెస్‌ పీవీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది'

బాబ్రీ మసీదును కూల్చినందుకే బీజేపీ నేతలు పీవీ నరసింహారావును పొగుడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. పీవీ బాబ్రీ మసీదును కూల్చి ఘోర తప్పిదం చేశారని తెలిపారు.

P. V. Narasimha Rao
author img

By

Published : Jun 26, 2019, 5:17 PM IST

కాంగ్రెస్‌ పీవీ నరసింహారావుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి. ఆయన రాజకీయాలు మానుకుని హైదరాబాద్‌కు వచ్చేశాక సోనియాగాంధీ పీవీని ప్రధాని చేశారని పేర్కొన్నారు. కానీ ఆయన పార్టీలో ఎందరో సీనియర్లను తొక్కేశాడని ఆరోపించారు.పీవీ బాబ్రీ మసీదును కూల్చి ఘోర తప్పిదం చేశారని...దీని వల్లనే ముస్లీంలు కాంగ్రెస్‌కు దూరమయ్యారని చిన్నారెడ్డి తెలిపారు. ప్రణబ్‌ ముఖర్జీ నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ సభకు వెళ్లి భారతరత్న అవార్డు తెచ్చుకున్నారని ఆక్షేపించారు. మన్మోహన్ సింగ్ బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు చేయలేదు కాబట్టి ఆయనను పొగడరన్నారు.

కేంద్ర ఆర్థిక సంఘం చెప్పిన లక్ష 80వేల కోట్లకు పైగా మొత్తం ఎక్కడ ఖర్చు పెట్టారని తెరాస ప్రభుత్వాన్ని చిన్నారెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరానికి ఎకరానికి రూ.75వేల ఖర్చు అవుతుందని...ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు 50వేల కోట్లు ఖర్చయిందన్నారు. వీటన్నింటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.

'కాంగ్రెస్‌ పీవీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది'

ఇవీ చూడండి:మీ ఉప్పులో సైనైడ్​ ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.