ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్​ కసరత్తు.. బోగస్​ ఓట్లపై ప్రత్యేక దృష్టి - కాంగ్రెస్​ నేతల తాజా వార్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌... ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టింది. అధికార తెరాస ఎత్తులను చిత్తు చేయాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు పిలుపునిచ్చిన పీసీసీ... డివిజన్ల పునర్విభజన, బోగస్‌ ఓట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించింది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్​ కసరత్తు.. బోగస్​ ఓట్లపై ప్రత్యేక దృష్టి

author img

By

Published : Sep 9, 2020, 6:28 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్‌.. పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతంకాకుండా... జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు పార్టీపరంగా బలోపేతానికి ఏ చర్యలు తీసుకోవాలన్న అంశంపై పీసీసీ ప్రత్యేక దృష్టిసారించింది. హైదరాబాద్‌ సహా వరంగల్‌, ఖమ్మం జిల్లాల కార్పోరేషన్‌ ఎన్నికలు కూడా ఉన్నందున అన్ని చోట్ల అధికార పార్టీకి ధీటుగా అభ్యర్థులను బరిలోదించి విజయం సాధించాలని ఇందిరాభవన్‌లో జరిగిన సమావేశంలో నేతలు నిర్ణయించారు.

అధికార తెరాస రాబోయే గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో గెలుపొందేందుకు బోగస్ ఓట్లు, డివిజన్ల అక్రమ పునర్విభజన కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు.. అప్రమతంగా ఉండి తిప్పి కొట్టాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. బోగస్‌ ఓట్లు భారీగా చేర్పించి లబ్దిపొందాలని, డివిజన్లలో ఒక్కోదగ్గర ఒక్కోరకంగా నమోదుచేయించడం ద్వారా విజయం సాధించాలని భావిస్తోందని ఆరోపించారు. డివిజన్ల పునర్విభజన పకడ్బందీగా జరిగేలా నాయకులు తగిన శ్రద్ధ వహించాలన్నారు. ఇందుకోసం 150 డివిజన్లలో కాంగ్రెస్ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేయాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సూచించారు. ప్రతి గడపకు నేతలు వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్న ఆయన.. ప్రభుత్వం నెరవేర్చని హామీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. బోగస్ ఓట్ల గుర్తింపునకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని పీసీసీకి ఎంపీ రేవంత్‌ రెడ్డ్డి సూచించారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభిప్రాయాలు తెలుసుకునే క్రమంలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఖైరతాబాద్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నాయకులు తగిన సహకారం అందించలేదని... అందువల్లనే ఓటమి పాలయ్యానని పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్‌ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నిరంజన్‌ జోక్యం చేసుకొని పీసీసీకి మద్దతుగా దాసోజును అడ్డుకునే యత్నం చేయడం వల్ల ఇద్దరి మధ్య మాట మాట పెరిగి సవాల్‌ విసురుకునే వరకు వచ్చింది. కాసేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తమ్‌ జోక్యం చేసుకుని సర్దిచెప్పడం వల్ల గొడవ సద్దుమణిగింది. దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినందున... గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేలా నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది.

ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.