తెలంగాణలో 2.45 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. 2.25 లక్షలకే లెక్క ఉందని, మిగతా భూమికి రికార్డు లేదని మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. ఇనాం, దేవాలయ భూములకు లెక్కలు లేవని స్పష్టం చేశారు. దళారులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయానికి మచ్చ తెస్తున్నారని దుయ్యబట్టారు.
కీసరలో భూమి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినప్పుడే తెలంగాణ సర్కార్ ప్రజలకు మంచి చేసినట్లని హనుమంతరావు అన్నారు. చట్టంలోని లోపాల వల్లే అధికారులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. నాగరాజు వంటి అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : అవినీతిలో నాగరాజు పడగ... బయటకు తీసినా కొద్ది సొమ్ము