దిల్లీలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల గురించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాల్లో కమిటీలు, అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోపై చర్చించామన్నారు. ఈ నెల 20లోగా అభ్యర్థులను ఖరారు చేసి ఏఐసీసీకి జాబితా పంపాలని రాహుల్‌గాంధీ సూచించినట్లు తెలిపారు. పొత్తులపై చర్చ జరిగిందని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
