ETV Bharat / state

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు - ఇంటింటికి వెళ్లి ఆరు గ్యారెంటీలు వివరిస్తున్న అభ్యర్థులు

Congress Party Campaign in Telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా విపక్షాలు ప్రచారాన్ని జోరుగా చేస్తున్నాయి. కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు దీటుగా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Congress Election Campaign in Telangana
Opposition Parties Campaign in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 2:32 PM IST

Opposition Parties Campaign in Telangana అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు

Congress Party Campaign in Telangana : అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి విజయ పతాకం ఎగరేసేందుకు కాంగ్రెస్‌ శతవిధాల యత్నిస్తోంది. నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకోగా... ఇంటింటి ప్రచారాలతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలంగాణ జన సమితి, వైఎస్​ఆర్​టీపీ మద్దతివ్వగా, సీపీఐతో ఉమ్మడిగా బరిలోకి దిగటం సానుకూలాంశంగా కనిపిస్తోంది. గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ హస్తం గుర్తుకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

మేం అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు : రేవంత్ రెడ్డి

Congress Six Guarantees Campaign 2023 : ఆరు గ్యారెంటీలకు జనాల్లో సానుకూల స్పందన వస్తుండటంతో.. కాంగ్రెస్ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఊరూ, వాడా పాదయాత్రలు, కార్నర్‌ మీటింగ్‌లతో నిత్యం ప్రజల్లో ఉండేలా హస్తం పార్టీ అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో.. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ మార్పు వార్తలను అద్దంకి దయాకర్ ఖండించారు. బీఆర్ఎస్​లో కుట్రలో భాగంగానే దుష్ప్రచారం జరుగుతుందన్న దయాకర్‌.. తుంగతుర్తిలో నామినేషన్‌ వేయనున్నట్లు వెల్లడించారు.

"మూడోసారి ఓట్లు అడుగుతున్నారు. ఆ పార్టీకీ ఓట్లు వేయొద్దు. గతంలోలా నమ్మి ఓట్లు వేస్తే దుబాయ్​లోలాగ బాసిన బతుకులు అవుతాయి. ఎవ్వరిని నమ్మకండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి." - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ

Congress Election Campaign in Telangana : ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర రావు రోడ్‌షోలతో ప్రచార జోరు పెంచారు. పలు చోట్ల తుమ్మలకు మద్దతుగా కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను నేరుగా కలుస్తున్నారు. ఇల్లెందు మున్సిపల్‌ ఛైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరావు సహా పలువురు కౌన్సిలర్లు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ కీలక నేతల వల్లే ఖమ్మంలో గులాబీపార్టీ గుండుసున్నా అయిందని తుమ్మల ఆరోపించారు.

మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ - కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల సాయం

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌ చేసి ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ నేతలు, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌ తరహాలో రీల్స్‌ తీసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. వెంపేటలో ప్రచారం నిర్వహించిన నర్సింగరావు కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి జడ్పీటీసీ సభ్యురాలు కాంగ్రెస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఏళ్లుగా పార్టీకోసం పనిచేసిన తనకి అన్యాయం చేశారని సున్నం నాగమణి బోరున విలపించారు.

ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు

MIM Party Election Campaign : హైదరాబాద్‌ పాతబస్తీలో ఎంఐఎం అభ్యర్థులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీ తన కుమారుడు నూరుద్దీన్‌ ఒవైసీతో కలిసి పాదయాత్ర చేపట్టారు. స్థానిక ఓటర్లు పూలమాలలు, శాలువాలతో అక్బరుద్దీన్ ఒవైసీకి ఘన స్వాగతం పలికారు.

గెలుపు బాటలో అభ్యర్థుల హోరాహోరీ-పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఓట్ల వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.