-
కోకాపేట భూముల వేలం పై కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ‘’HMDA’’ కార్యాలయంలో ఉన్న సమాచారం అంతా మాయం అవడంతో ఇంటి దొంగల పాత్ర నిజమని తేలిపోయింది. కేంద్ర హోంశాఖ తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం.
— Revanth Reddy (@revanth_anumula) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">కోకాపేట భూముల వేలం పై కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ‘’HMDA’’ కార్యాలయంలో ఉన్న సమాచారం అంతా మాయం అవడంతో ఇంటి దొంగల పాత్ర నిజమని తేలిపోయింది. కేంద్ర హోంశాఖ తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం.
— Revanth Reddy (@revanth_anumula) October 4, 2021కోకాపేట భూముల వేలం పై కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ‘’HMDA’’ కార్యాలయంలో ఉన్న సమాచారం అంతా మాయం అవడంతో ఇంటి దొంగల పాత్ర నిజమని తేలిపోయింది. కేంద్ర హోంశాఖ తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం.
— Revanth Reddy (@revanth_anumula) October 4, 2021
కోకాపేట భూముల వేలంపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ మరోసారి డిమాండ్(Congress demands CBI probe into Kokapet land auction) చేసింది. ఇప్పటికే ఈ అంశంపై సీబీఐకి ఫిర్యాదు చేశామని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ట్వీట్ (mp revanth reddy) చేశారు. తాము ఫిర్యాదు చేసిన తర్వాత హెచ్ఎండీఏలో (hmda) కీలక సమాచారం మాయమైందన్నారు. సమాచారం మాయం చేయడంతో... ఇంటి దొంగల పాత్ర నిజమని తేలిందని రేవంత్ ట్వీట్‌లో ఆరోపించారు. కేంద్రం తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.
ఇదే అంశాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (clp leader batti vikramarka) శాసనసభలో ప్రస్తావించారు. 10వేల హెచ్‌ఎండీఏ దస్త్రాలు హ్యాక్ అయ్యాయని భట్టి ఆరోపించారు. పత్రికలో వచ్చిన కథనాన్ని సభలో చూపించారు. ధరణి హ్యాక్ అయితే రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదమని మండిపడ్డారు. ఆ వివరాలు నమోదు చేసుకున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. త్వరలో తెలియజేస్తామని బదులిచ్చారు.
'' 10 వేల హెచ్‌ఎండీఏ దస్త్రాలు హ్యాక్ అయ్యాయి. ధరణి హ్యాక్ అయితే రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదం. కోకపేట భూముల వేలంపై పలు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రస్ పార్టీ తరఫున సీబీఐకు ఫిర్యాదు చేశాం. సమాచారం అంతా మిస్ అయిందని ఇప్పటికే పేపర్లో వచ్చింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.''
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
రేవంత్ ట్వీట్...
''కోకాపేట భూముల వేలంపై కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఉన్న సమాచారం అంతా మాయం అవడంతో.. ఇంటి దొంగల పాత్ర నిజమని తేలింది. కేంద్ర హోంశాఖ తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం.''
- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ
REVANTH REDDY: సీబీఐని కలిసిన రేవంత్.. కోకాపేట్, ఖానామెట్ భూముల అమ్మకాలపై ఫిర్యాదు