ETV Bharat / state

Uttam On Debts: ఎనిమిదేళ్లలో రాష్ట్ర అప్పు ఐదు రెట్లు పెంచారు: ఉత్తమ్ - trs government in telangana

Uttam On Debts: తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విమర్శించారు. పెద్ద రాష్ట్రాలతో సమానంగా అప్పులు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రాల అప్పులపై పార్లమెంట్​లో ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ సమాధానమిచ్చారు.

Uttam On Debts
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి
author img

By

Published : Jul 25, 2022, 6:07 PM IST

Uttam On Debts: మితిమీరిన అప్పులతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. అధిక వడ్డీలతో అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్​ సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ అనంతరం దిల్లీలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. ఇవాళ పార్లమెంట్​లో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన కేంద్రమంత్రి నిర్మల లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

రాష్ట్రంలో అప్పులే తప్ప అభివృద్ధి కనిపించడం లేదు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా నాశనమవుతోంది. జీతాలు ఇవ్వలేని స్థితిలోకి రాష్ట్ర ఆర్థికపరిస్థితి దిగిజారిపోయింది. మన కంటే పెద్ద రాష్ట్రాల్లో అప్పులు తక్కువగానే ఉన్నాయి. ఇష్టానుసారంగా అప్పులు చేయడం దేశానికి మంచిది కాదు. - ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ

ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రజలకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఉత్తమ్​ మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర అప్పును 5 రేట్లు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020 మార్చి 31 నాటికి రాష్ట్ర అప్పు రూ.2.25లక్షల కోట్లు ఉంటే.. 2021 మార్చి 31 నాటికి రాష్ట్ర అప్పు రూ.2.67లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. 2014 లో తెలంగాణ అప్పు రూ. 69 వేల కోట్లు ఉంటే.. 2022 మార్చి 31 నాటికి రాష్ట్ర అప్పు రూ.3.12 లక్షల కోట్లుగా ఉన్నట్లు పార్లమెంట్​లో కేంద్రం సమాధానమిచ్చిందని ఉత్తమ్​ వెల్లడించారు. ప్రతి ఏటా రూ.40 నుంచి రూ.50 వేల కోట్లు అప్పు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంకెలు తారుమారు చేసి చూపిస్తోందని కాగ్ చెప్తోందని ఆయన వివరించారు. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌తో సమానంగా అప్పులు ఉన్నాయని ఎంపీ వెల్లడించారు.

ఇవీ చదవండి: అటవీ అధికారులకు పోడు రైతుల మధ్య తోపులాట

ఆ ఎంపీలకు ఏడుగురు సంతానం.. మరి 'జనాభా నియంత్రణ' ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.