ETV Bharat / state

రాహుల్‌గాంధీ జోడో యాత్ర తెలంగాణలో చరిత్ర సృష్టిస్తుంది: ఉత్తమ్‌

author img

By

Published : Oct 20, 2022, 3:38 PM IST

Uttam Kumar Reddy on Bharat Jodo Yatra: దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు తెలంగాణ సమాజం మద్దతుగా నిలవాలని కాంగ్రెస్‌ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని... ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. రాహుల్‌గాంధీ విరామ సమయంలో రాజకీయేతర వర్గాలను కలిసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. రాహుల్‌ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్న ఉత్తమ్‌... కాంగ్రెస్‌ అంతర్గత ప్రజాస్వామ్యానికి ఖర్గే ఎన్నికే నిదర్శనమన్నారు.

Uttam Kumar Reddy
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy on Bharat Jodo Yatra: ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నిక కావడంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతం అవుతుందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆయన గెలుపు కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని కొనియడారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసే సమయంలో.... అనేక వర్గాలతో రాహుల్ కలుస్తారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.

'నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తి చేసుకున్న రాహుల్‌గాంధీ జోడోయాత్ర ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఈ జోడోయాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఇలాంటి కార్యక్రమం మరోసారి మనం చూడలేం. గాంధీ జోడో యాత్ర తెలంగాణలో చరిత్ర సృష్టిస్తుంది. మేం మళ్లీ అధికారంలోకి వస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది. తెలంగాణలో ప్రతిసమస్యపై రాహుల్‌గాంధీ చర్చిస్తారు.'-ఉత్తమ్‌కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని... ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ హితం కోసమేనని మాజీ ఎంపీ మధుయాస్కీ తెలిపారు. దేశంలో కులాలు, వర్గాల వారీగా విడదీసే ప్రయత్నం జరుగుతోందని.. వారందరిని ఏకం చేసే పనిలో భాగంగా ఈ యాత్ర చేస్తున్నట్లు వివరించారు.

తెలంగాణలో రాహుల్‌ను యాత్రలో కలిసేందుకు అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు సంప్రదిస్తున్నట్లు మధుయాస్కీ పేర్కొన్నారు. మద్యం, డబ్బు ప్రభావంతో గెలవాలని భాజపా, తెరాస పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యంతులని ప్రలోభాలకు లొంగరని అన్నారు.

రాహుల్‌గాంధీ జోడో యాత్ర తెలంగాణలో చరిత్ర సృష్టిస్తుంది: ఉత్తమ్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.