Uttam on earlier Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. హోటల్ తాజ్ దక్కన్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ వదిలేసి ఆయా నియోజకవర్గాలకు వెళ్లాలని సూచించారు. తానెక్కడ పోటీ చేయాలనేది సోనియాగాంధీ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీ, పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్ ప్రస్తావిస్తుందని ఉత్తమ్ వెల్లడించారు. గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం సరైన విధానం కాదన్నారు. ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు అక్రమాలు పెరిగిపోయాయని వాటిపై సభలో నిలదీస్తామని తెలిపారు. కృష్ణా నదిపై ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వర, పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ ఎందుకు పోరాటం చేయడంలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న కేసీఆర్.. ఇప్పటికైనా బడ్జెట్‌లో కేటాయించాలన్నారు.
కేసీఆర్ అహంకార ధోరణికి నిదర్శనం..
గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం సరైన విషయం కాదు. ఇది సీఎం కేసీఆర్ అహంకార ధోరణికి నిదర్శనం. కాంగ్రెస్ తరఫున దీనిని ఖండిస్తున్నా. రాజ్యాంగ సంప్రదాయాలను ఈ విధంగా తుంగలో తొక్కడం సరికాదు. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీ, పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్ ప్రస్తావిస్తుంది. దళితబంధు పథకాన్ని సరైన విధంగా అమలు చేయాలి. ఈ బడ్జెట్‌లో కనీసం 85వేల కోట్లు దళితబంధు కోసం కేటాయించి ప్రభుత్వానికి దళితులపై గల చిత్తశుద్ధిని చాటుకోవాలి. నిరుద్యోగ భృతిని తప్పనిసరిగా ఈ బడ్జెట్‌లో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.
-ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
ఇదీ చదవండి: