ETV Bharat / state

మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు సెమీఫైనల్‌: జీవన్‌రెడ్డి - congress MLC jeevan reddy

Jeevan reddy On munugodu: మునుగోడు ఉప ఎన్నిక తమకు సెమీఫైనల్‌ లాంటిదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుని సీటు నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతోనే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

జీవన్‌రెడ్డి
జీవన్‌రెడ్డి
author img

By

Published : Aug 8, 2022, 5:14 PM IST

మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు సెమీ ఫైనల్‌: జీవన్‌రెడ్డి

Jeevan reddy On munugodu: మునుగోడు ఉప ఎన్నిక తమకు సెమీ ఫైనల్‌ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుని సీటు నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ కంటే భాజపా ఏ ఒక్క మంచి చేసిందో రాజగోపాల్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. తెరాస మునిగిపోయే పడవ అన్నారు.

కాంగ్రెస్ గోవు లాంటిది, భాజపా పులిలాంటిదని రాజగోపాల్‌ అన్నారు. పాలిచ్చే, పూజించే గోవును వదిలి పులి వద్దకు వెళ్తే ఏమవుతుంది. రాజగోపాల్‌రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రద్దు చేసినందుకు భాజపాకు ఓటువేయాలా. అన్నింటి ధరలు పెంచినందుకు భాజపాకు ఓటు వేయాలా?. తెలంగాణ ఏర్పాటును కించపరిచినందుకు ఓటు వేయాలా?. దేశంలో సైనికులకు వేతనాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితి. మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు సెమీ ఫైనల్‌. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం. - జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

కాంగ్రెస్‌ గోవు లాంటిది, భాజపా పులి లాంటిదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని జీవన్‌ రెడ్డి గుర్తు చేశారు. పాలిచ్చే, పూజించే గోవును వదిలి పులి వద్దకు వెళ్తే ఏమవుతుందని ప్రశ్నించారు. రాజగోపాల్‌ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రద్దు చేసినందుకు భాజపాకు ఓటేయాలా? అన్నింటిధరలు పెంచినందుకు, తెలంగాణ ఏర్పాటును కించపరిచినందుకు ఓటేయాలా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

దేశంలో సైనికులకు వేతనాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందని జీవన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు సెమీఫైనల్‌లాంటిదని.. 2023లో తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపుఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్‌ ఉపయోగించుకోలేదని.. మూడున్నరేళ్లలో ప్రజలకోసం ఆయన చేసిన ఉద్యమం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. ఆయన ఫైట్‌చేస్తానంటే కాంగ్రెస్‌ అడ్డుపడిందా? అని నిలదీశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇకపై అసెంబ్లీలో అడుగు పెట్టరని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడులో గతంకంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని మరోసారి రుజువు చేస్తామని వెల్లడించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపును ఎవరు అడ్డుకోలేరన్నారు.

ఇవీ చదవండి: 'త్వరలో తెరాస పార్టీలో బాంబ్​ బ్లాస్ట్'

'సభలో సింహం'.. వెంకయ్యపై ప్రశంసల జల్లు.. ఎంపీల స్పెషల్ రిక్వెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.