ETV Bharat / state

కేటీఆర్ అబద్ధాలను కూడా వినసొంపుగా చెప్పారు: శ్రీధర్ బాబు - అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన శ్రీధర్​బాబు

Congress MLA Sridhar Babu: రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్​ ఎమ్మెల్యే శ్రీధర్​బాబు పేర్కొన్నారు. ఈరోజు గవర్నర్​కు ధన్యవాదాలు తెలిపే అంశంపై శాసనసభలో చర్చ సాగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ అబద్ధాలను కూడా వినసొంపుగా చెప్పారని ఎద్దేవా చేశారు.

mla sridharbabu
ఎమ్మెల్యే శ్రీధర్​బాబు
author img

By

Published : Feb 4, 2023, 3:58 PM IST

Updated : Feb 4, 2023, 5:18 PM IST

MLA Sridhar Babu spoke in assembly meeting: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లల్లో రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తరుగు పేరుతో క్వింటాల్​కు 8 కిలోల చొప్పున దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు గవర్నర్​కు ధన్యవాదాలు తెలిపే అంశంపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన రైతు సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణలో ఈ ఏడాది 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని శ్రీధర్​బాబు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఆ కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఈరోజు రాష్ట్రంలో కరెంట్​ కోతలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. గత ఎన్నికల ముందు చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైందని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వీరి అందరికీ ఎప్పుడు నిరుద్యోగభృతి ఇస్తారో తెలపాలన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చిందని వెల్లడించారు.

వైద్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని.. ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ మాట ఏమైందన్నారు. 108 అంబులెన్స్​ సేవలను కూడా ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. ఇరిగేషన్​ ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్​ చేశారు. ఈ కాళేశ్వరం వల్ల కొత్తగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో చెప్పాలని కోరారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. సర్పంచులు ఆత్మహత్యలు, ఆందోళనలు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు ఉంటుందన్నారు. అసలు వారికి నిధులిచ్చే ఆలోచన ఉందా అని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు పలు ప్రశ్నలు సంధించారు.

"రాష్ట్రవ్యాప్తంగా 107 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మోసం చేస్తున్నారు. క్వింటాకు 8కేజీలు చొప్పున పక్కన పెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో కరెంట్​ కోతలు అధికంగా ఉన్నాయి. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఏమైంది. ఫీజు రీయంబర్స్​మెంట్​ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోంది. ప్రతి జిల్లాకు ఒక సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి అన్నారు. ఆ హామీ ఏమైంది. ఇరిగేషన్​ ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు అందుతోంది. అసలు కాళేశ్వరం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదు. సర్పంచుల నిధుల్లో స్పష్టత లేదు." - శ్రీధర్​ బాబు, కాంగ్రెస్​ ఎమ్మెల్యే

కేటీఆర్ అబద్ధాలను కూడా వినసొంపుగా చెప్పారు: శ్రీధర్ బాబు

ఇవీ చదవండి:

Last Updated : Feb 4, 2023, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.