ETV Bharat / state

ఓటమిపై హస్తం మేధోమథనం - congress in telangana

మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమికి కారణాలను ఆరా తీస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కంటే ఓట్లు శాతం పెరిగినా... నాలుగు ఛైర్మన్ల పదవులకే పరిమితం కావడం వల్ల మున్సిపాలిటీల వారీగా పార్టీ స్థితిగతులను అంచనా వేయాలని నిర్ణయించింది. అసలే వార్డు సభ్యులు గెలువని, తక్కువ స్థానాలు గెలిచిన మున్సిపాలిటీలను గుర్తించి.. అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

congress meet about municipal Elections
ఓటమిపై హస్తం మేథోమథనం
author img

By

Published : Jan 29, 2020, 3:52 PM IST

Updated : Jan 29, 2020, 4:34 PM IST

ఓటమిపై హస్తం మేథోమథనం

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాలుగు మున్సిపాలిటీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల కంటే ఓట్ల శాతం పెరిగినట్లు హస్తం పార్టీ అంచనా వేస్తోంది. 2,616 స్థానాల్లో పోటీ చేసి.. 580 స్థానాలు దక్కించుకుని... 31 శాతానికిపైగా ఓట్లు వచ్చినట్లు లెక్కలు కడుతున్నారు. అధిక స్థానాలు వచ్చిన చోట్ల కూడా ఎక్స్‌ అఫిషియో సభ్యులను వాడుకుని అధికార తెరాస... ఛైర్మన్‌ పదవులను ఎగురేసుకుని పోయింది.

31శాతానికిపైగా ఓట్లు వచ్చినట్లు లెక్కలు

డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేయటంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడి మున్సిపల్‌ ఎన్నికల్లో 90 శాతానికిపైగా పురపాలికలను తెరాస కైవసం చేసుకుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌.. పార్టీ అంతర్గత లోపాలపై కూడా ఆరా తీస్తోంది. సగటున 31శాతానికిపైగా ఓట్లు వచ్చినట్లు లెక్కలు వేస్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి... మున్సిపాలిటీల వారీగా ఓట్ల శాతాన్ని తెప్పించుకుంటున్నారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, పది నగరపాలక సంస్థల నుంచి వార్డుల వారీగా, డివిజన్ల వారీగా ఓట్ల శాతంపై ఆరా తీస్తున్నారు.

అంతర్గత విబేధాలు

తక్కువ స్థానాలు గెలిచిన మున్సిపాలిటీలను గుర్తించి అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్షేత్ర స్థాయిలో తెరాసను ఎదుర్కోలేకపోవటానికి కారణాలను... ఇతర లోపాలను గుర్తించి... చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. స్థానిక నాయకత్వ పనితీరు, నాయకుల మధ్య ఉన్న అంతర్గత విబేధాల గురించి ఆరాతీస్తోంది.

పీసీసీ అధ్యక్ష పదవి మార్పుపై ఊహాగానాలు

మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయినందున త్వరలో పీసీసీ అధ్యక్ష పదవి మార్పు ఉంటుందన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పట్లో రాష్ట్రంలో ఏలాంటి ఎన్నికలు లేనందున... ఇప్పటికిప్పుడు అత్యవసరంగా అధ్యక్ష పదవి మార్పు ఉండదని పలువురు సీనియర్లు చెబుతున్నారు. మొదట ఏఐసీసీ ప్రక్షాళన జరుగుతుందని... అందులో భాగంగా ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కీలకమైన పదవి ఇస్తారని... ఆ తర్వాతనే నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్

Last Updated : Jan 29, 2020, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.