ETV Bharat / state

CONGRESS: కాంగ్రెస్ 'దళిత గిరిజన ఆత్మగౌరవ సభ' వాయిదా!

author img

By

Published : Aug 13, 2021, 4:23 PM IST

Updated : Aug 13, 2021, 6:18 PM IST

ఈ నెల 18న కాంగ్రెస్​ తలపెట్టిన 'దళిత గిరిజన ఆత్మగౌరవ సభ' వాయిదా పడే అవకాశం ఉంది. పార్లమెంటరీ కమిటీ పర్యటన వల్ల సభకు హాజరుకాలేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది.

CONGRESS: కాంగ్రెస్​ ఇబ్రహీంపట్నంలో తలపెట్టిన సభ వాయిదా!

కాంగ్రెస్‌ ఇబ్రహీంపట్నంలో ఈ నెల 18న తలపెట్టిన 'దళిత గిరిజన ఆత్మగౌరవ సభ' వాయిదా పడే అవకాశం ఉంది. శనివారం కాంగ్రెస్‌ కోర్ కమిటీలో చర్చించి నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలో సభపై రేవంత్‌ రెడ్డి ఈనెల 9న ఇంద్రవెల్లిలో జరిగిన సభలో ప్రకటించారు. పార్లమెంటరీ కమిటీ పర్యటన వల్ల సభకు హాజరుకాలేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనతో మాట్లాడినట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సాధ్యమైనంతవరకు సభను వాయిదా వేసుకోవాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన వివరించారు. పార్లమెంటరీ కమిటీ పర్యటన ఈ నెల 17వ తేదీ 21వ తేదీ వరకు ఉన్నందున ఈనెల 18వ తేదీన నిర్వహించనున్న సభకు హాజరుకాలేనని తెలియజేసినట్లు పేర్కొన్నారు. 21వ తేదీ తరువాత ఎప్పుడు పెట్టిన సభకు హాజరయ్యేందుకు అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్లు తెలిపారు. 21వ తేదీ తరువాత ఇద్దరం కలుద్దామని రేవంత్ రెడ్డికి సూచించానని కోమటిరెడ్డి వివరించారు. పార్టీ సమావేశంలో చర్చించి సభ వాయిదా వేసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

సమన్వయకర్తలకు దిశానిర్దేశం

కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపకల్పన చేసింది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీకి చెందిన నాయకులను స్థానిక నాయకులతో సమన్వయం చేసుకునేందుకు సమన్వయకర్తలను నియమించింది. రెండు రోజుల కిందట రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియమించారు. వారందరికీ దిశానిర్దేశం చేసేందుకు ఇవాళ సాయంత్రం ఇందిరా భవన్​లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులు, సీనియర్ నేతలు పాల్గొని నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ విధానాలను, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల ప్రాముఖ్యతను జనంలోకి తీసుకెళ్లి పార్టీపరంగా నిర్వహిస్తున్న సభలకు పెద్ద సంఖ్యలో దళిత, గిరిజన ప్రజలు హాజరు అయ్యేటట్లు చూడాలని సూచించనున్నారు. ప్రధానంగా అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు దళిత బంధు పథకం అమలు తీరుపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి: Satyavathi Rathod: 'ఏ ఒక్క చిన్నారి అనాథనని బాధపడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం'

Last Updated : Aug 13, 2021, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.