111 జీవోకు విరుద్ధంగా రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఉన్న నిర్మాణాలను చూసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల అరెస్ట్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పోలీసుల వైఖరితోపాటు... ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ను చూడకుండా వందల సంఖ్యలో పోలీసులతో తమను ఎందుకు అడ్డుకున్నారని భట్టి నిలదీశారు.
అది నిషేధిత ప్రాంతమని పోలీసులు చెప్తున్నారని... ఎలా నిషేధిత ప్రాంతమవుతుందని... అక్కడ రహస్యంగా జరిగే కార్యక్రమాలు ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. అక్రమ కట్టడాలు కూల్చేయాలని ఆదేశాలిచ్చే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆరే... 111జీవోను ఉల్లంఘించారని ఆరోపించారు. కేటీఆర్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదంటే... సీఎం కేసీఆర్ చేయించాలని డిమాండ్ చేశారు.
కోకాపేట సబితానగర్ కూడలి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని... గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు. సెక్షన్ 151 కింద ముందస్తు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు.
ఇదీ చూడండి: దేవుడిని ఎత్తుకునేందుకు గజరాజుల పరుగుపందెం!