ETV Bharat / state

ఈఆర్సీ ఛైర్మన్​ను కలిసిన కాంగ్రెస్​ పార్టీ ప్రతినిధులు - congress leaders met erc chairman

Congress leaders met ERC: విద్యుత్​ ఛార్జీల పెంపు నిర్ణయంపై గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలపై భారం పెంచొద్దని.. పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ధర్నాలు చేపట్టారు. ఈ క్రమంలో ఈఆర్సీ ఛైర్మన్​ జస్టిస్​ శ్రీరంగారావును.. కాంగ్రెస్​ పార్టీ ప్రతినిధులు కలిశారు. విద్యుత్​ ఛార్జీలను పెంచొద్దని వినతిపత్రం అందజేశారు.

electricity charges hike in telangana
తెలంగాణలో విద్యుత్​ ఛార్జీల పెంపు
author img

By

Published : Mar 28, 2022, 8:14 PM IST

Congress leaders met ERC: విద్యుత్​ ఛార్జీలను పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని.. పాత ఛార్జీలనే అమలు చేయాలని ఈఆర్సీని కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు కోరారు. హైదరాబాద్​ సింగరేణి భవన్‌లో ఈఆర్సీ ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీరంగారావును.. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్​, ప్రధాన కార్యదర్శి హర్కర్‌ వేణుగోపాల్‌, వివిధ అనుబంధ సంఘాల ఛైర్మన్లు కలిశారు. పెంచిన విద్యుత్​ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం బకాయి పడ్డ రూ.13వేల కోట్లు తక్షణమే వసూలు చేయడంతో పాటు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఛార్జీల పెంపుపై చర్చించాలని కాంగ్రెస్​ ప్రతినిధులు కోరారు. విద్యుత్తు సంస్థలకు చెందిన పూర్తి ఆధారాలతో కూడిన శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి: రేవంత్‌కు ఫ్రీహ్యాండ్... అసంతృప్తులకు హైకమాండ్ షాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.