అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఉద్యమించాలని ఏఐసీసీ ఇంఛార్జి కుంతియా పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ప్రాథమిక హక్కులు కావని సుప్రీం తీర్పు వెలువరించిన దృష్ట్యా... భవిష్యత్ కార్యచరణపై గాంధీభవన్లో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. భాజపా రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు ప్రయత్నింస్తుందని... దీనిపై ఉద్యమించకపోతే చాలా నష్టపోతామని కుంతియా అభిప్రాయపడ్డారు.
కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి వల్లనే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు దక్కాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. భాజపా ప్రభుత్వం పేదలకు రిజర్వేషన్లు దూరంచేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ వీహెచ్, మాజీ మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.