ETV Bharat / state

ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ హెచ్​ఆర్సీలో కాంగ్రెస్ ఫిర్యాదు​

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ కాంగ్రెస్​ పార్టీ నాయకులు హెచ్​ఆర్సీని ఆశ్రయించారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

Congress leaders meet HRC to replace jobs in the state
ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ హెచ్​ఆర్సీని ఆశ్రయించిన కాంగ్రెస్​
author img

By

Published : Sep 21, 2020, 4:50 PM IST

నిరుద్యోగుల వయసు మీరిపోతోందని.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేసింది. నియామకాల పేరుతో ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రంలో గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావడం లేదని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్​రెడ్డి కమిషన్​కు వివరించారు. ఉపాధి కల్పన అవకాశాలు లేవని.. ఫలితంగా రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు, వారి హక్కులు హరించుకుపోతున్నాయని ఆవేదనన వ్యక్తం చేశారు.

సకాలంలో ఉద్యోగాలు భర్తీ కాకపోవడం వల్ల సుమారు 3 లక్షల మంది యువకుల వయో పరిమితి దాటిపోయి.. వారి బతుకులు వ్యర్థమవుతున్నాయని కమిషన్​కు వివరించారు. చదువుకున్న ప్రతి వ్యక్తికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాకపోయినప్పటికీ.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రం చేపట్టాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో, కార్పొరేషన్​లలో సుమారు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటన్నింటికి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి.. నగరవాసులకు కాంగ్రెస్ శ్రేణులు అండగా ఉండాలి: రేవంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.