రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పలువురు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల విలీనం వంటి అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన తేదీలతో సహా ఫిరాయింపు ఆధారాలు ఇచ్చినట్లు భట్టి విక్రమార్క వివరించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తగిన చర్యలు చేపడతామని తమిళిసై హామీ ఇచ్చినట్లు సీఎల్పీ నేత తెలిపారు.
ఇదీ చదవండిః 'కచ్చులూరు గ్రామప్రజల సహాయం మరచిపోలేం'