ఫార్మాసిటీపై కేటీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. ఫార్మాసీటీ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు, ప్రజలు లేకుండా మమ అనిపించారని విమర్శించారు. ఒక్క గుంట భూమి కూడా చట్ట ప్రకారం సేకరణ జరగలేదని ధ్వజమెత్తారు. తీసుకున్నదంతా కూడా దళితుల భూమేనని ఆరోపించారు.
భూములు సేకరించడంలో కుంభకోణం జరిగిందని, కంపెనీలతో కేటీఆర్ లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఫార్మాసీటీ పేరిట భూములు సేకరించి కార్పొరేట్ శక్తులకు ఇవ్వాలని చూస్తున్నారని విమర్శించారు. పేద రైతులను భయపెట్టి భూములు లాక్కుంటూ... రియల్ ఎస్టేట్ సంస్థ మాదిరిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: 'సాగు చట్టాలపై పార్లమెంట్ సమావేశాల్లో విస్తృతంగా చర్చించాలి'