Congress Leaders Fires on BRS : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార పార్టీ, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నారు. ఎలాగైనా మరోసారి అధికారం చేజిక్కించువాలని బీఆర్ఎస్.. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పోటీపడుతుంది. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, విజయశాంతి పాల్గొన్నారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.
Uttam Kumar Reddy Comments on KCR : ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి (MP Uttam Kumar Reddy)ఆరోపించారు. రైతు బంధు ఆపాలని తాను ఎక్కడా చెప్పలేదని చెప్పారు. తమ మేనిఫెస్టో చదివితే.. తాము ఏం చేయబోతున్నామో తెలుస్తుందని అన్నారు. రుణ మాఫీ ఏకధాటిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అన్నదాతలను ఓట్లు అడిగే అర్హత కేసీఆర్‌కు (CM KCR) లేదని పేర్కొన్నారు. కర్షకులకు.. క్రాప్ ఇన్సూరెన్స్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే - ఆయన మనవడిని కూడా మంత్రిని చేస్తాడు : రేవంత్ రెడ్డి
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బీఆర్ఎస్ ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. కానీ హస్తం పార్టీ ఇచ్చి చూపిస్తుందని చెప్పారు. మేడిగడ్డ కుంగిపోయినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సిగ్గు పడాలని అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
"ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. రైతు బంధు ఆపాలని నేను ఎక్కడా చెప్పలేదు. రైతులను ఓట్లు అడిగే అర్హత కేసీఆర్‌కు లేదు. రాష్ట్ర ప్రజలు బైబై కేసీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్ కంటే మెరుగ్గా కాంగ్రెస్ పాలన ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే రెండు సార్లు రిస్క్ తీసుకున్నారు. ఇకపై రిస్క్ తీసుకోలేరు. తెలంగాణలో రాబోయేది ప్రజాపాలన. కాంగ్రెస్ అంటే క్రెడిబిలిటి." - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ
Vijayashanti Fires on KCR : మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని విజయశాంతి (Congress Leader Vijayashanti) అన్నారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితే వెళ్లానని.. ఏళ్లు గడిచినా కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. ముఖ్యమంత్రి అవినీతి పరుడని కమలం నేతలు విమర్శిస్తారని.. కానీ ఆయన అవినీతిపరుడైతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆధారాలు ఉండి కూడా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకోలేదని విజయశాంతి ఆరోపించారు.
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. తెరపై విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నాయని విజయశాంతి అన్నారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించవద్దని కోరామని.. కానీ ఆయనను తొలగించడంతో కమలం పార్టీ పరువు పోయిందని చెప్పారు. కేసీఆర్‌ను ఓడించడమే ఉద్యమకారుల లక్ష్యమని విజయశాంతి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఉండదని కేసీఆర్ తప్పుడు మాటలు చెప్తున్నారు : రేవంత్ రెడ్డి