ETV Bharat / state

బయటికి రండి...​ నిధులపై కలిసి పోరాడుదాం : పొన్నం - సీఎం కేసీఆర్​పై మండిపడ్డ కాంగ్రెస్​ నేతలు

స్థానిక సంస్థల నిధులను రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రాజీవ్​గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహా దీక్షకు కాంగ్రెస్​ నేతలు హాజరయ్యారు. మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమీషన్లే తప్ప ప్రజల సంక్షేమం ప్రభుత్వానికి అవసరంలేదని విమర్శించారు.

congress leaders fire on govt to not release panchayat raj funds funds in the state
బయటికి రండి...​ నిధులపై కలిసి పోరాడుదాం : పొన్నం
author img

By

Published : Dec 22, 2020, 3:18 PM IST

పంచాయతీరాజ్​ నిధులు మంజూరు చేయకుండా కేసీఆర్ సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్​ నాయకులు విమర్శించారు. స్థానిక సంస్థల నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్​ వద్ద రాజీవ్​గాంధీ పంచాయతీరాజ్​ సంఘటన ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ హాజరయ్యారు.

ప్రజా సంక్షేమం కంటే కమిషన్లే సీఎంకు ముఖ్యమని గీతారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్​ నాయకులను బెదిరిస్తూ కేసులు పెట్టి నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీరాజ్​ వ్యవస్థను మరింత పరిపుష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని పొన్నం ప్రభాకర్​ తెలిపారు. రాష్ట్రప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉండి నిధులు లేకుండా సర్పంచులు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. నిధుల కోసం పోరాడేందుకు కాంగ్రెస్​తో కలిసి రావాలని... పోరాడి హక్కులను సాధించుకుందామని పొన్నం పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:హైదరాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.