ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి తదితరులు కిష్టారెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ప్రజల పక్షపాతి అని, ఆయన సేవలను ప్రజలు ఎప్పటికీ మరవలేనివని జానారెడ్డి కొనియాడారు. నియోజకవర్గంలో అవసరమున్న ప్రతి చోట ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించి విద్యుత్తు సరఫరా అందేట్లు చూశారని గుర్తు చేశారు.
కిష్టారెడ్డి తనకు ఎంతో సన్నిహితుడని, ఆయన మరణం తనను కలచివేసిందని మాజీ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఎడ్మ కిష్టారెడ్డి పేదల పెన్నిదని... మానవతావాదని...పేదల అభ్యన్నతి కోసం పాటుపడిన వ్యక్తని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి కొనియాడారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
ఇవీ చూడండి: మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత