తెరాస నేత పెట్రోల్ పెట్రోల్ దాడి ఘటనలో గాయపడిన శరణప్పను గాంధీ ఆస్పత్రిలో కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌లు పరామర్శించారు. శుక్రవారం రాత్రి జరిగిన పెట్రోల్ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శరణప్ప కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నాయకులు ఓదార్చారు. అతని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శరణప్పపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని అన్నారు.
తెలంగాణ పోలీసులు తెరాస కార్యకర్తలుగా మారారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఈ ఘటన ఎంతో బాధాకరమని అన్నారు. అతనిపై పెట్రోల్‌తో దాడి చేయడం, అక్కడ ఉన్న మహిళలపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడడం సరికాదన్నారు. పేదవారు నగరంలో బతకలేని దారుణ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
బోయినపల్లిలో ఓ స్థల వివాదంలో తనపై ముగ్గురు వ్యక్తులు వచ్చి పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డారని బాధితుడు శరణప్ప తెలిపాడు. తాను ప్రకాష్ రెడ్డి వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నానన్నారు. మాధవరెడ్డి అతని అనుచరులు వచ్చి అర్ధరాత్రి సమయంలో వచ్చి మహిళపై దాడి చేసి, తనపై పెట్రోల్ దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి : అధికార పార్టీ ఆగడాలు అరికట్టాలి : సీఎల్పీ నేత భట్టి