కొహెడలో తాత్కాలిక నిర్మాణాలు కూలిపోయి కొందరు తీవ్రంగా గాయపడడంపై డీజీపీకి లేఖ రాస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొహెడ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్న ఆయన... ఒక ప్రణాళికను రూపకల్పన చేసుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఉత్తమ్