Renuka Choudary On Police: పంజాగుట్ట ఎస్‌ఐ కాలర్ పట్టుకున్న వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి స్పందించారు. తనకు పోలీసుల పట్ల గౌరవం ఉందని యూనిఫాంను ఎలా గౌరవించాలో తెలుసన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో తమ చుట్టూ మగ పోలీసులు ఎందుకున్నారని ఆమె ప్రశ్నించారు. తనను వెనక నుంచి తీయడంతోనే బ్యాలెన్స్ తప్పి కింద పడే క్రమంలో ఎస్‌ఐ ఉపేంద్ర బాబు భుజాన్ని పట్టుకున్నానని ఆమె తెలిపారు. ఎస్‌ఐని అవమాన పర్చడం తన ఉద్దేశం కాదన్నారు.
యూనిఫాంను ఎలా గౌరవించాలో మాకు తెలుసు. పోలీసుల పట్ల మాకు గౌరవం ఉంది. మా చుట్టూ మగ పోలీసులు ఎందుకున్నారు. వెనకాల నుంచి నన్ను తోసేశారు. నేను అదుపుతప్పి కిందపడుతుండగా ఎస్‌ఐ భుజం పట్టుకున్నా. ఎస్‌ఐని అవమానపర్చడం నా ఉద్దేశం కాదు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. కక్షసాధింపునకు దర్యాప్తు సంస్థలను కేంద్రం వినియోగిస్తోంది.
- రేణుకాచౌదరి, కాంగ్రెస్ నేత
చలో రాజ్భవన్లో పాల్గొన్న రేణుకా చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న తన కాలర్ పట్టుకొని దౌర్జన్యం చేసినందుకు పంజాగుట్ట ఎస్‌ఐ ఉపేంద్రబాబు రేణుకా చౌదరిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 353 కింద రేణుకా చౌదరిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి:
'కాలర్ పట్టుకున్నందుకు రేణుకపై.. బస్సు ధ్వంసం చేసినందుకు కార్యకర్తలపై కేసులు'
Renuka Chowdhury : 'నన్నే పట్టుకుంటావా.. స్టేషన్కు వచ్చి మరీ కొడతా..'