ETV Bharat / state

'కేసీఆర్​ నిర్ణయాల వల్ల నదీ జలాలు వృథా అవుతున్నాయి'

సీఎం కేసీఆర్​ నిర్ణయాల వల్ల ప్రజా ధనంతో పాటు... నదీ జలాలు వృథా అవుతున్నాయని పీసీసీ  మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్​మానేరుకు నీరు వస్తే తప్ప రైతులకు ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిని చరిత్ర క్షమించదని ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగా చర్చకు రావాలని సవాల్​ విసిరారు.

పొన్నాల లక్ష్మయ్య
author img

By

Published : Aug 6, 2019, 10:55 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు అందివ్వలేకపోతున్నారని... నదీ జలాలు సముద్రం పాలవుతున్నాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. ఎల్లంపల్లి నుంచి మిడ్​ మానేరుకు నీరు వస్తే తప్ప రైతులకు ప్రయోజనం ఉండదని... వీటి మధ్య 6, 7, 8 ప్యాకేజీలు పూర్తి చేస్తే ఆయకట్టుకు నీరు వచ్చేదని అభిప్రాయపడ్డారు. పైన ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కింద ఉన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పనులకు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. రెండున్నర వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే... ఎత్తిపోసిన నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లకుండా వాడుకునేవాళ్లమని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న కేసీఆర్​ను చరిత్ర క్షమించదని... దీనిపై చర్చకు రావాలని సవాల్​ విసిరారు.

'కేసీఆర్​ నిర్ణయాల వల్ల నదీ జలాలు వృథా అవుతున్నాయి'

ఇదీ చూడండి : గోదావరి నది సజీవంగా ఉంది: కేసీఆర్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.